Reading Time: 2 minutes
Soundarya: సౌందర్య చనిపోతే ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పార్టీ చేసుకుందా? అసలు నిజమేమిటంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘మహానటి’ సావిత్రి తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి సౌందర్య అని చెప్పవచ్చు. తన సహజ సిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో హోమ్లీ హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుందీ అందాల తార. బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, జగపతిబాబు, మోహన్ బాబు, అమితాబ్ బచ్చన్.. ఇలా ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్నారు సౌందర్య. ఒక్క తెలుగులోనే కాదు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషల్లో వందలాది సినిమాలు చేశారామె. తన అందం, అభినయంతో చాలా ఏళ్ల పాటు సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు సౌందర్య. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. 2004లో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య దుర్మరణం చెందారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది.తెలుగు చిత్ర పరిశ్రమలోనే యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీలో అత్యంత విషాదకర సంఘటనల్లో సౌందర్య మరణం ఒకటని చెప్పవచ్చు. కాగా సౌందర్య ఈ లోకం నుంచి వెళ్లిపోయి ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. అయినా తన సినిమాల రూపంలో ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూ ఉంటారీ ముద్దుగుమ్మ. సౌందర్యతో కలిసి పనిచేసిన హీరోలు, హీరోయిన్లు అప్పుడప్పుడూ తమ ఇంటర్వ్యూల్లోనూ ఈ నటిని గుర్తుకు చేసుకుంటారు.

ఇదిలా ఉంటే సౌందర్య చనిపోయినప్పుడు, ఆ తర్వాత కూడా చాలా రూమర్లు హల్ చల్ చేశాయి. సౌందర్య మరణానికి వారే కారణమంటూ ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. ఇదే క్రమంలో సౌందర్య చనిపోయిన రోజున ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫుల్ గా పార్టీ చేసుకుందని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు బాబు బొమ్మ స్నేహ. సౌందర్య లాగే స్నేహ కూడా హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్కిన్ షోకు దూరంగా ఉంటూ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంది. 2001 లో వచ్చిన ‘ప్రియమైన నీకు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన స్నేహ ఆ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ ‘శ్రీరామదాసు’ ‘సంక్రాంతి’ ‘రాధా గోపాలం’ ‘వెంకీ’ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అప్పట్లో స్నేహను చూసి ఆమె మరో సౌందర్య అవుతుందనుకున్నారు. అందుకే సౌందర్య చనిపోయినప్పుడు ఆమె పార్టీ చేసుకుందని ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించిన స్నేహ. ‘ఒకరి చావులో ఆనందాన్ని వెతుక్కునే మనిషిని కాదని.. ఎవరో కావాలనే అలాంటి అసత్య ప్రచారానికి పూనుకున్నారంటూ’ పేర్కొంది.

స్నేహ లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Sneha (@realactress_sneha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి