Reading Time: < 1 minute

ఆ హాస్టళ్లకు హైడ్రా డెడ్ లైన్.. మాట వినకుంటే కూల్చుడే!

Caption of Image.

అక్రమ నిర్మాణాలపై హైడ్రా నేరుగా చర్యలు తీసుకోదని హైడ్రా కమీషనర్ రంగనాథ్ చెప్పారు.  జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల విజ్ఞప్తి మేరకే ప్రమాదకర భవనాల తొలగింపు ఉంటుందన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్న భవనాలపైనే హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రమాదకర భవనాల్లో హాస్టళ్లు నిర్వహించొద్దని సూచించారు. సురక్షిత భవనాల్లోకి హాస్టళ్లను మార్చేందుకు 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 

హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు . హైడ్రా, ఏసీబీ లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.  హైడ్రా పేరుతో బెదిరించి డబ్బులు గుంజితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైడ్రా పేరుతో డబ్బులు అడిగితే ఎలాంటి చెల్లింపులు చేయొద్దని 2026 అక్టోబర్ 9న ప్రెస్ మీట్ సందర్భంగా పేర్కొన్నారు.  అక్రమ వసూళ్లకు పాల్పడితే ఈ కింది నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

 ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్: 1064

  హైడ్రా కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్: 1070

©️ VIL Media Pvt Ltd.