Reading Time: < 1 minute

ఆడబిడ్డలకు సీఎం రేవంత్ బతుకమ్మ శుభాకాంక్షలు

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగి లిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు మహిళలందరూ ఆటపాటలతో ఈ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించడమే తెలంగాణ ప్రత్యేకతని ఆయన పేర్కొన్నారు. 

ప్రజల సామూహిక జీవన విధానానికి, కష్టసుఖాలను పంచుకునే ఐక్యతకు, ఆత్మగౌరవానికి బతుకమ్మ నిలువెత్తు నిదర్శనమని  అభివర్ణించారు. ప్రకృతిని ఆరాధించే తెలంగాణ సాంస్కృతిక వైభవానికి అనుగుణంగానే తమ ప్రజా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.