Reading Time: 2 minutes
OTT Movie: ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్ సిరీస్.. ఒంటరిగా మాత్రం చూడొద్దు.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ వీకెండ్ లో ఓటీటీలో మీరు హారర్, సస్పెన్స్‌తో నిండిన సినిమా కానీ వెబ్ సిరీస్ కానీ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ వెబ్ సిరీస్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దెయ్యాలు, రహస్య సంఘటనలు, సైకలాజికల్ థ్రిల్స్ కలగలిసిన ఈ కథ, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది. ఒక అమ్మాయి జీవితంలోని చేదు గతం నుండి మొదలయ్యే ఈ కథ, ఢిల్లీలోని ఒక మహిళా హాస్టల్‌లో గల 333వ నంబర్ గది చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక కేవలం దెయ్యాల కథ మాత్రమే కాదు. మానసిక ఒత్తిడి, మానవ స్వభావం, గతంలోని బాధాకరమైన అనుభవాలను కూడా అన్వేషిస్తుంది. గదిలోని రహస్య సంఘటనల వెనుక అసలు ఏముందో తెలుసుకోవాలనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేస్తుంది. స్వేచ్ఛగా తనకు తానుగా బతకాలని కలలు కంటూ ఢిల్లీకి వచ్చిన మాధురి (చమ్ దరంగ్) అనే అమ్మాయి
ఓ మారుమూల హాస్టల్లో ఉంటుంది. అయితే ఆ హాస్టల్ లోకి అడుగు పెట్టగానే అక్కడున్న అమ్మాయిలు మాధురిని హెచ్చరిస్తారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత వెళ్లాలనుకున్న వెళ్లలేవని భయపెడతారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ గదిలో అతీత శక్తులు ఉన్నాయని తెలుసుకుంటుంది మాధురి. దీంతో వాటి వల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది.. చివరకు ఓ భూత వైద్యుడి సాయంతో ఆమె అక్కడ ఏం తెలుసుకుంది. ? చివరకు వాటి నుంచి ఆమె ఎలా బయటపడింది ? అనేది తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

 

ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఫేరు ‘ఖౌఫ్’. అంటే తెలుగులో భయం అని అర్థం. టైటిల్ కు తగ్గట్గుగానే ఈ సిరీస్ చాలా భయానకంగా సాగుతుంది. కొన్ని సీన్లు అయితే వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి, ఒక్కో ఎపిసోడ్ సుమారు 43 నుంచి 50 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సిరీస్‌కు IMDbలో 7.4 రేటింగ్ లభించడం విశేషం. డైరెక్టర్స్ పంకజ్ కుమార్, సూర్య ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. మోనికా పవర్ ,రజత్ కపూర్, అభిషేక్ చౌహాన్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా, దరంగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఐఎమ్ డీబీలోనూ ఈ సిరీస్ కు 7.4 రేటింగ్ ఉండడం విశేషం. ఓటీటీలో మంచి హారర్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారు ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వద్దు. అయితే ఒంటరిగా మాత్రం చూడొద్దు.

‘ఖౌఫ్’ వెబ్ సిరీస్ ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి