నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పల్లె, పట్నంలో ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. మహాలయ అమావాస్య తర్వాత అక్టోబర్ 11 నుంచి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అయితే ఈ సమయంలో గ్రహాలు, నక్షత్రాల అద్భుతమైన కలయికలు జరగనున్నాయంట. దీని వలన నాలుగు రాశుల వారి తలరాత మారడం పక్కా అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈ నవరాత్రి నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. వ్యాపారులకు లాభాలు రెట్టింపు అవుతాయి. అమ్మవారి అనుగ్రహంతో ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.
ధనస్సు రాశి : దసరా నవరాత్రి ఉత్సవాలు వీరికి ఆనందాన్ని తీసుకొస్తున్నాయి. ఈ రాశి వారిపై దుర్గామాత అనుగ్రహం ఉంటుంది. అందువలన చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా, విదేశాలకు వెళ్లాలనే కల నెరవేరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆదాయం పెరుగుతుంది.
మిథున రాశి : ఈ నవరాత్రి మిథున రాశి వారికి కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనయోగం పడుతుంది. పెట్టుబడుల నుంచి మంచి లాభం వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయం లభిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి
మీన రాశి : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వీరి ఇంట ఆనందం నెలకుంటుంది. ప్రతి పనిలో విజయం వీరిదే అవుతుంది. గురు బలం వల్ల అన్ని పనులు విజయవంతం అవుతాయి. కొత్త ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. 9 రోజులు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరిక నెరవేరుతుంది.




