Reading Time: < 1 minute

ఇవాళ్టి(అక్టోబర్9) రాత్రి నుంచి.. ఢిల్లీలో 24గంటలు ఇంటర్నెట్ బంద్

Caption of Image.

సర్ ప్రక్రియలో అక్రమాలతో ఓట్ చోరీ చేశారని, చీఫ్ ఎలక్షన్ కమిషర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన క్రమంలో సెంట్రల్ ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. ఈ రోజు(శుక్రవారం) రాత్రం 10 నుంచి సెంట్రల్ ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్ల మూసివేతతోపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.  

అక్టోబర్ 10న సీజేపీ, విద్యార్థి సంఘాల నిరసనలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. గతంలో జరిగిన నిరసనల్లో రూల్స్  ఉల్లంఘించినందుకు తాజా నిరసనలకు అనుమతి నిరాకరించారు.ముందస్తు చర్యల్లో భాగంగా మెట్రో స్టేషన్ల మూసివేత, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, భారీ బందోబస్తు చేపట్టినట్లు తెలిపారు. 

►ALSO READ | పాక్ ప్రధాని అత్యుత్సాహం.. ట్రంప్కు నోబెల్ నిరాశ.. విజేత నవీ పిళ్లై జోక్ వైరల్!

మరోవైపు ఢిల్లీలోని 57  మెట్రోస్టేషన్లను మూసివేస్తు్నట్లు DMRC ప్రకటించింది. పోలీసుల ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రినుంచే సెంట్రల్ ఢిల్లీలోని మెట్రో స్టేషన్లలో రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ జిల్లాలోని జంతర్ మంతర్ తో పాటు ఇతర  కీలక ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొనేందుకు నిరసనల కారులు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని గుర్తించిన మెట్రో స్టేషన్లలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులు DMRC ని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.