Reading Time: < 1 minute

తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. రెండు స్థానాలను గెలుచుకున్న విజయ్ పార్టీ

Caption of Image.

తమిళనాడులో అధికార టీవీకే పార్టీ ప్రభంజన సృష్టించింది. సీఎం విజయ్ పాలనకు రెఫరెండంగా భావించిన ఉపఎన్నికల్లో ధారాపురం, మధురాంతకం స్థానాలను గెలుచుకుంది. 2026 అక్టోబర్ 9న జరిగిన కౌంటింగ్ లో ముందునుంచీ టీవీకే అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతూ చివరికి విజయం సాధించారు.  

ధారాపురం నియోజకర్గంలో టీవీకే అభ్యర్థి సత్యభామ గెలుపొందారు. మొత్తం 23 రౌండ్ల కౌంటింగ్ తర్వాత సత్యభామ 9 వేల 471 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆమెకు మొత్తం 66 వేల 841  ఓట్లు వచ్చాయి. అంటే  37.02 శాతం ఓట్లతో  గెలుపొందారు. ఇక డీఎంకే 57 వేల 370  (  31.78%) ఓట్లతో రెండో స్థానంలో నిలవగా.. అన్నాడీఎంకే  45 వేల 280  ( 25.08%) ఓట్లు సాధించింది.

ధారాపురంలో జనరల్ ఎలక్షన్లలో 40 వేల ఓట్లతో ఓడిన టీవీకే.. ఇప్పుడు దాదాపు పదివేల ఓట్ల తేడాతో గెలుపొందటం గమనార్హం.

ఇక మధురాంతకంలో 19 వేల 241 ఓట్లతో టీవీకే అభ్యర్థి మరగతం కుమారవేల్ విజయాన్ని అందుకున్నారు. దీంతో పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుతూ పార్టీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.

ALSO READ : ఇండియా కూటమి నేతలను కలిసేందుకు రాష్ట్రపతి అంగీకారం..

ఇక తమ పాలనకు రెఫరెండంగా భావించి ఉపఎన్నికలకు వెళ్లిన టీవీకే.. తమ పాలనపై ప్రజలకు విశ్వాసం ఉందని.. ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భావిస్తోంది. పార్టీ గెలుపుతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 

©️ VIL Media Pvt Ltd.