Reading Time: < 1 minute

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Caption of Image.

సంగారెడ్డి జిల్లా  మనూరు గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతికేందుకు చెరువుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం కలకలం రేపింది. 2026 అక్టోబర్ 9న చెరువులో మునిగి ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబాన్ని దుఖసముద్రంలో ముంచి వేసింది.

మృతులను నరసింహారెడ్డి (45), అతని భార్యబ కృష్ణవేణి (38), సంగమేశ్వర్ రెడ్డి (42)గా గుర్తించారు. గాలింపు చర్యల్లో నరసింహారెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి మృతదేహాలను బయటకు తీశారు. ప్రాణాలతో ఉన్న  నరసింహారెడ్డి భార్య కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. 

నరసింహారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ జరిగిన సంఘటనను గ్రామస్తులకు చెప్పడంతో అక్కడికి చేరుకొని మృతదేహాలు వెలికి తీశారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

©️ VIL Media Pvt Ltd.