
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని సీజేపీ నిరసనల క్రమంలో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. అక్టోబర్ 10న సెంట్రల్ ఢిల్లీలోని అన్ని దుకాణాలు, ఆఫీసులు, వ్యాపార సంస్థలను మూసివేయాలని ఆదేశించారు. పోలీసుల ఆదేశాల మేరకు 57 మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్లు DMRC ప్రకటించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఢిల్లీతోపాటు జంతర్ మంతర్, ఇతర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఆంక్షలు శుక్రవారం రాత్రినుంచే అమలులోకి రానున్నాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ఓట్ల దొంగతనం చేశారంటూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. జంతర్ మంతర్‌తోపాటు న్యూఢిల్లీ జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థులు, యువత, ప్రజాసంఘలు, విద్యార్థి సంఘాలప్రతినిధులు,ప్రతిపక్షాలను నేతలు కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీంతో భారీ పోలీసు బలగాలను మోహరించి ముందస్తు చర్యలు చేపట్టారు.
నిరసనలు, పోలీసుల ఆంక్షల క్రమంలో వాహనదారులు, ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడనుంది. సెంట్రల్ ఢిల్లీతోపాటు పలు మెట్రో మార్గాల్లోని స్టేషన్లపై పడనుంది. రాజీవ్ చౌక్, కేంద్ర సచివాలయం, పటేల్ చౌక్, జనపథ్, మండి హౌస్, ఐటీఓ, ఢిల్లీ గేట్, కాశ్మీర్ గేట్, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.