Reading Time: < 1 minute

Nidhhi Agerwal Marriage: తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా? నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Caption of Image.

టాలీవుడ్ గ్లామల్ డాల్ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలు, సొగసైన అభినయంతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఈ ఏడాది డార్లింగ్ ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సంగతి తెలిసిందే. వెండితెరపై ఎంత గ్లామర్ ఒలకబోస్తుందో, సోషల్ మీడియాలోనూ అంతే హాట్ ఫొటోషూట్‌లతో నెట్టింట హల్ చల్ చేస్తుందిఈ భామ.

ప్రస్తుతం కాస్త సినిమాల స్పీడ్ తగ్గించినా నిధి క్రేజీ మాత్రం తగ్గలేదు .. లేటెస్ట్ గా హైదరాబాద్‌లో జరిగిన ఒక గ్రాండ్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైంది. అక్కడ ఆమెను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. ఈ ఈవెంట్‌లో విలేకరులు అడిగిన కొన్ని క్రేజీ ప్రశ్నలకు నిధి తనదైన శైలిలో ఫన్నీగా అన్సర్‌ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. 

ముఖ్యంగా మీరు తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటారా?అని ఓ రిపోర్టర్ అడగ్గా.. ఈ అందాల భామ కాస్త సిగ్గుపడుతూ, చిలిపిగా నవ్వుతూ అది చెప్పలేను.. మే బీ చేసుకోవచ్చేమో అంటూ పరోక్షంగా చెప్పేసింది. ఈ బ్యూటీ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో కాకరేపుతోంది. మరో వైపు ఈ ముద్దుగుమ్మ లవ్ లో ఉందా? అన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

►ALSO READ | తారక్ ఫ్యాన్స్‌కు సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్.. నేరుగా ఎన్టీఆర్‌కే ట్యాగ్ చేస్తూ పోస్ట్!

అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాలతో తనకు ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బిగ్ బాంబ్ పేల్చింది. చాలామంది నన్ను నార్త్ ఇండియా బ్యూటీ అనుకుంటారు, కానీ నేను పుట్టింది పక్కా హైదరాబాద్‌లోనే.  కాబట్టి నేను కూడా పక్కా తెలుగమ్మాయినే అంటూ నిధి అగర్వాల్ క్లారిటీ ఇచ్చేసింది. 

‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజాసాబ్’ లాంటి బిగ్ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది నిధి. మరి ఇప్పుడు తెలుగబ్బాయిలు ఆమె ఇచ్చిన ‘గ్రీన్ సిగ్నల్’ పై సోషల్ మీడియా వేదికగా ఫుల్ ఖుషీ అవుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.