Reading Time: < 1 minute

‘అమ్మో ఎవ్వర్రా ఇది’.. ‘సీన్’ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ 

Caption of Image.

సూర్య, నజ్రియా నజీమ్ జంటగా జితూ మాధవన్  రూపొందిస్తున్న చిత్రం ‘సీన్’.  ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్,  ఆనంద్‌‌‌‌‌‌‌‌ రాజ్, లాల్, రాజ్‌‌‌‌‌‌‌‌ ప్రియన్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జగరం స్టూడియోస్,  2డి ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ బ్యానర్లపై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా,  తాజాగా ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా, వినాయక్ పాడాడు.

‘అమ్మో  ఎవర్రా ఇది..’ అంటూ  నజ్రియా  నజీమ్ పాత్రను ఉద్దేశిస్తూ సాగిన పాట ఆకట్టుకుంది.  నజ్రియా పాత్రలోని అగ్రెసివ్, ఎనర్జిటిక్ నేచర్‌‌‌‌‌‌‌‌ను చూపించారు.   వీడియో గేమ్ కాన్సెప్ట్ చుట్టూ ఈ పాటను క్రియేటివ్‌‌‌‌‌‌‌‌గా డిజైన్ చేశారు. కొరియోగ్రాఫర్ రాజ్ ప్రియన్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్నాడు.  మలయాళంలో రోమాంచం, ఆవేశం చిత్రాలతో మెప్పించిన జితూ మాధవన్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.  దీపావళి కానుకగా నవంబర్ 6న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు

©️ VIL Media Pvt Ltd.