Reading Time: 2 minutes
Wealth Astrology: పరివర్తన యోగంతో వీరిపై సిరుల వర్షం..లిస్ట్‌‌లో మీ రాశి ఉందా..?

గ్రహ చారంలో చంద్ర, కుజుల మధ్య పరివర్తన జరిగితే కొన్ని రాశులకు అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. వీరి సంపాదన ఓ స్థాయిలో ఉంటుంది. స్థిరాస్తులు సమకూరుతాయి. ఆశించిన స్థాయిలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ నెల (అక్టోబర్) 13, 14, 15 తేదీల్లో చంద్ర, కుజుల మధ్య చోటు చేసుకుంటున్న పరివర్తన వల్ల ఇటువంటి ఫలితాలన్నీ అనుభవానికి వస్తాయి. చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో కుజుడు, కుజుడికి చెందిన వృశ్చిక రాశిలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఈ పరివర్తన కలిగింది. వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ యోగం సంపూర్ణంగా వర్తించి, వీరిని అపర కుబేరుల్ని చేస్తుంది.

వృషభం

ఈ రాశికి తృతీయ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరగడం వల్ల కొద్ది ప్రయత్నంతో సంపద వృద్ధి చెందుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. శత్రువుల నుంచి సైతం ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, షేర్లు, వడ్డీ వ్యాపారాలు విజయాలు సాధించడం వంటివి జరుగుతాయి

కర్కాటకం

రాశ్యధిపతి చంద్రుడికి, పంచమాధిపతి కుజుడికి పరివర్తన జరగడం వల్ల ఉద్యోగ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి సంపా దన పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పిల్లలకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థికంగా ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

తుల

ఈ రాశికి ధన, దశమాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని ఇళ్లు, స్థలాలు, పొలాల మీద పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా సంపాదించే సూచనలు కూడా ఉన్నాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వస్తుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది.

వృశ్చికం

భాగ్య స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడికి, భాగ్యాధిపతి చంద్రుడికి మధ్య పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశీ సంపాదన యోగం కలుగుతుంది. వారసత్వ సంపద సంక్రమిస్తుంది. పిత్రార్జితం లభిస్తుంది. అప్రయత్న ధన లాభానికి, ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. జీతభత్యాల పరంగా కూడా ఆదాయం పెరుగుతుంది. అదనపు రాబడి ఉంటుంది. షేర్లు, స్పెక్యు లేషన్లు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారమవుతుంది.

మకరం

ఈ రాశికి సప్తమ, లాభాధిపతుల మధ్య పరివర్తన జరగడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. నిజ ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆస్తి కలిసి వస్తుంది. సొంత ఇంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి భూముల మీద పెట్టడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది.

మీనం

ఈ రాశికి పంచమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.. షేర్లు, స్పెక్యులేషన్లతో పాటు,. స్థిరాస్తుల మీద కూడా పెట్టుబడులు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది.