Reading Time: 2 minutes
Tilak Varma: రాంచీ టీ20లో తిలక్ వర్మ విధ్వంసం.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు

Tilak Varma: టీమిండియా యంగ్ సెన్సేషన్, టీ20 వైస్ కెప్టెన్ కెప్టెన్ తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆయన ఈ అరుదైన మైలురాయిని అధిగమించాడు. టీ20 ఫార్మాట్‌లో వేగంగా 5,000 పరుగులు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలవడమే కాకుండా, దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్

తిలక్ వర్మ కేవలం 166 ఇన్నింగ్స్‌లలోనే టీ20 క్రికెట్‌లో 5,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, తిలక్ ఒక ఇన్నింగ్స్ ముందే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ కేవలం 143 ఇన్నింగ్స్‌లలో 5,000 పరుగులు సాధించి అగ్రస్థానంలో ఉండగా, రుతురాజ్ గైక్వాడ్ (145), శుభ్‌మన్ గిల్ (154), అభిషేక్ శర్మ (165) ఆ తదుపరి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Sanju Samson: ఫామ్‌లోకి వచ్చేసిన సంజూ శాంసన్.. ఫోర్లు, సిక్సర్లతో ఉతికారేసిన ఛెటా

రాంచీ మైదానంలో మెరుపు ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌లో 15వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ ఆరంభం నుంచే అటాకింగ్ మోడ్‌లో ఆడాడు. రాంచీ మైదానంలో ఎంఎస్ ధోనీ తరహా ఫినిషింగ్ ఇస్తూ కేవలం 18 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, బౌండరీలతో నాటౌట్‌గా 44 పరుగులు సాధించాడు. ఇతనికి తోడుగా ఈషాన్ కిషన్ 43 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 40 పరుగులు చేయడంతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు 40కి పైగా పరుగులు సాధించడం కూడా ఒక రికార్డుగా నిలిచింది.

డొమెస్టిక్, ఐపీఎల్ ప్రదర్శన విశేషాలు

తిలక్ వర్మ తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో భారత్ తరఫున కీలక పరుగులు సాధించినప్పటికీ, ఎక్కువ పరుగులు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున, డొమెస్టిక్ క్రికెట్‌లో హైదరాబాద్ జట్టు తరఫునే సాధించాడు. హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు కలిసి 3,268 పరుగులు చేయగా, అంతర్జాతీయంగా భారత్ తరఫున మైదానంలో 150 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ వస్తున్నాడు.

ఇది కూడా చదవండి: Sanju Samson: రాంచీలో సంజూ సునామీ.. సెంచరీ మిస్సవడంతో పాటు చెత్త రికార్డు నమోదు

భారత్ తరఫున అత్యంత వేగంగా 5000 టీ20 పరుగులు చేసిన టాప్-6 బ్యాటర్లు

1. కేఎల్ రాహుల్ – 143 ఇన్నింగ్స్‌లు

2. రుతురాజ్ గైక్వాడ్ – 145 ఇన్నింగ్స్‌లు

3. శుభ్‌మన్ గిల్ – 154 ఇన్నింగ్స్‌లు

4. అభిషేక్ శర్మ – 165 ఇన్నింగ్స్‌లు

5. తిలక్ వర్మ – 166 ఇన్నింగ్స్‌లు

6. విరాట్ కోహ్లీ – 167 ఇన్నింగ్స్‌లు

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..