
Anandhi: సినీ పరిశ్రమలో ఒక బలమైన కథ సెట్స్‌పైకి వెళ్లడానికి ఎన్నో మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ఒకరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ అంటే నటీనటులకు కత్తిమీద సామే. ఏమాత్రం తేడా వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందన్న భయం వెంటాడుతుంది. ఇప్పుడు అలాంటి ఒక సవాలుతో కూడిన పాత్ర చుట్టూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్ల చేతులు మారిన గరివిడి లక్ష్మి లాంటి ఒక పవర్‌ఫుల్ బయోపిక్, చివరకు హీరోయిన్ ఆనంది వద్దకు ఎలా చేరిందన్న విషయం ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. తాజా ఇంటర్వ్యూలో హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. ఈ బయోపిక్ స్క్రిప్ట్ రెడీ అయిన వెంటనే మేకర్స్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్‌ను సంప్రదించారని అన్నారు.
నిత్యామీనన్‌తో సహా నలుగురైదుగురు క్రేజీ హీరోయిన్లకు ఈ కథను వినిపించారని చెప్పారు. కొందరికి లుక్ టెస్టులు, వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించారన్నారు. అయితే ఆ పాత్ర డిమాండ్ చేసే భావోద్వేగాలు, అసలైన వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఎదురయ్యే రిస్క్ చూసి ఎవరూ ముందుకు రాలేకపోయారని వెల్లడించారు. అంతటి ఛాలెంజింగ్ రోల్‌ను ఒప్పుకోవడానికి స్టార్ హీరోయిన్లు సైతం వెనకడుగు వేయడంతో ప్రాజెక్ట్ కొంతకాలం సందిగ్ధంలో పడిందన్నారు. అందరూ చేతులెత్తేసిన తర్వాత ఈ కథ డెబ్యూ డైరెక్టర్ ద్వారా తన టేబుల్ మీదికి వచ్చిందన్నారు ఆనంది. డైరెక్టర్ దాదాపు మూడున్నర గంటల పాటు కథను పూసగుచ్చినట్లు వివరిస్తున్నంత సేపూ తన కళ్లలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయని, ఒక కళాకారిణి జీవితంలో ఇన్ని ఎదురుదెబ్బలు, ఇంతటి పోరాటం, సమాజం నుంచి ఎదురైన ఇన్ని కష్టాలు ఉంటాయా అని తాను నిశ్చేష్టురాలయినట్లు చెప్పారు. కేవలం విన్నప్పుడే గుండె బరువెక్కించిన ఆ జీవితాన్ని ఎలాగైనా తెరపైకి తీసుకురావాలని, స్టార్ హీరోయిన్లు వద్దనుకున్నా సరే తాను రిస్క్ చేయాలని అక్కడికక్కడే నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎవరైతే వెనకడుగు వేశారో వారికి సమాధానం చెప్పేలా, ఆ పాత్రకు సంపూర్ణ న్యాయం చేయాలన్న పట్టుదలతో ఈ ఛాలెంజ్‌ను తాను స్వీకరించినట్లు ఆనంది చెప్పారు. స్టార్ హీరోయిన్స్ సైతం చేయలేకపోయిన ఈ బరువైన బయోపిక్‌తో ఆనంది వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.