Reading Time: 2 minutes

ఓట్ చోరీని వ్యతిరేకించక పోవడంతో షాకయ్యాం: రాష్ట్రపతితో మీటింగ్ అనంతరం రాహుల్ వ్యాఖ్యలు

Caption of Image.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఇండియా కూటమి నేతల సమావేశం ముగిసింది. 2026 అక్టోబర్ 9న రాత్రి ప్రసిడెంట్ ను కలిసిన కూటమి నేతలు ఓట్ చోరీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలపై రాష్ట్రపతికి మమొరాండం సమర్పించారు. పది మంది నేతలను కలిసేందుకు రాష్ట్రపతి అనుమతించడంతో కూటమి నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, సుప్రియా సూలే, డి రాజా తదితర నేతలు రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

రాష్ట్రపతి ప్రజాస్వామ్యాన్ని  రక్షిస్తారని భావిస్తున్నాం: రాహుల్

రాష్ట్రపతి మెమొరాండం ఇచ్చామని అన్నారు రాహుల్. మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ ఇండియా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. ఆ విషయాన్ని రాష్ట్రపతికి చెప్పినట్లు తెలిపారు. ఓట్ చోరీ, ఎలక్షన్ చోరీతో జరిగిన నష్టాన్ని వివరించినట్లు తెలిపారు. 

ఓట్ చోరీపై ప్రూఫ్ గురించి దేశం మొత్తానికి తెలుసని.. 2024 ఎన్నికలు చోరీకి గురయ్యాయని అన్నారు రాహుల్. ఓట్ చోరీకి సంబంధించిన ప్రూఫ్ ను రాష్ట్రపతికి అందజేస్తామని అన్నారు. ప్రసిడెంట్ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

నేను ఇప్పుడే ఒక నమ్మశక్యంకాని సమావేశం నుంచి బయటకు వచ్చాను. మమతాజీ అని చెప్పడం కూడా చాలా తక్కువే, కాబట్టి అసలు ఏం జరిగిందో నేను మీకు చెబుతాను. మొదటగా, మేము భారత రాష్ట్రపతికి ఒక వినతిపత్రాన్ని సమర్పించాము. ఆ వినతిపత్రంలో, ప్రధాని మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నారని మేము స్పష్టంగా పేర్కొన్నాము. రాష్ట్రపతి మేము చెప్పినదాన్ని ఖండించలేదు, మా ప్రకటనలను ప్రశ్నించలేదు లేదా వాటికి వ్యతిరేకంగా ఏ విధంగానూ వాదించలేదు, అని రాహుల్ గాంధీ అన్నారు.

ఆమె మా వాదనలను అంగీకరించి, ఎన్నికల దొంగతనానికి సంబంధించిన రుజువులను సమర్పించాలని మాతో అన్నారు. ఎన్నికల దొంగతనానికి సంబంధించిన సాక్ష్యాలు దేశమంతటికీ తెలుసని నేను ఆమెతో చెప్పాను. రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు దొంగలించారు. మీకు తెలిసినట్లుగా, 2024 ఎన్నికలు చోరీకి గురయ్యాయి అని  అన్నారు.

బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని కోరాం: ఖర్గే

ప్రసిడెంట్ ముర్ముతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రధాని మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా ఖర్గే అన్నారు. సీఈసీతో బీజేపీ కుమ్మక్కయిందని ఆరోపించారు. ఓట్ చోరీపై రాష్ట్రపతికి వివరించామని.. దేశంలో ఏం జరుగుతుందో చెప్పామని తెలిపారు. ప్రజల హక్కకుల రక్షణకై పోరాటం చేస్తున్నామన్న ఖర్గే.. బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.

మమతా బెనర్జీ:

భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని అన్నారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ (ఎం) చీఫ్ మమతా బెనర్జీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. డెమోక్రమసీ రక్షణకోసం ఇండియా కూటమి పోరాడుతుందని చెప్పారు. 

©️ VIL Media Pvt Ltd.