Reading Time: < 1 minute

ఇండియా కూటమి నేతలను కలిసేందుకు రాష్ట్రపతి అంగీకారం.. సాయంత్రం 8 గంటలకు మీటింగ్

Caption of Image.

ఇండియా కూటమి నేతలను కలిసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగీకరించారు. 2026 అక్టోబర్ 9న సాయంత్రం 8 గంటలకు రాష్ట్రపతి భవన్ లో ఇండియా బ్లాక్ నేతలు ప్రసిడెంట్ తో సమావేశం కానున్నారు. సర్ ప్రక్రియ, ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహారంపై చర్చించనున్నారు. 

ఇండియా కూటమి నేతలతో ప్రసిడెంట్ ముర్ము భేటీని రాష్ట్ర భవన్ కన్ఫమ్ చేసింది. కాంగ్రెస్ ప్రసిడెంట్ మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తదితర పది మందితో కూడిన బృందం రాష్ట్రపతిని కలవనున్నారు. 

మరోవైపు విపక్ష పార్టీలు మూడో రూజు కూడా ఆందోళనను తీవ్ర తరం చేశాయి. సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

గురువారం (అక్టోబర్ 8) తమ ఆందోళనను తీవ్రతరం చేసిన ఇండియా కూటమి నేతలు.. . రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ స్మారక చిహ్నం దగ్గర ఇండియా  కూటమి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగతనం అనే నేరపూరిత కుట్ర ద్వారా దేశాన్ని హైజాక్ చేస్తున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. శుక్రవారం కూడా అదే స్థాయిలో ఆందోళన కొనసాగించారు.

ALSO READ : యోగి సర్కార్ కీలక నిర్ణయం..

గత 10 నుంచి 15 ఏళ్లుగా భారతదేశ ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగం తీవ్రంగా దెబ్బతిన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓట్ల దొంగతనం ఆరోపణలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తాత్కాలిక నిరసనగా కాకుండా, ప్రజాస్వామ్యాన్ని బాగు చేసుకునే వరకు కొనసాగే  ఉద్యమంగా అభివర్ణించారు.

©️ VIL Media Pvt Ltd.