Reading Time: 2 minutes

మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు! ..ఢిల్లీ పోలీసుల మిస్ బిహేవియర్ పై రాహుల్ ఫైర్

Caption of Image.

సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ లో జరుగుతున్న నిరసనల క్రమంలో మహిళా జర్నలిస్టులపై పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన  ఇప్పుడు చర్చనీయాంశమైంది. న్యూస్ కవరేజ్  చేస్తు్న్న సమయంలో పోలీసులు సిబ్బంది తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించడం కలకలం రేపుతోంది.  ఈ ఘటనపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కేంద్ర హోమంత్రి  ఈ ఘటనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.      

అక్టోబర్ 3 న జంతర్ మంతర్ దగ్గర  జరిగిన నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తుండగా మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్శించారని ముగ్గురు  మహిళా  జర్నలిస్టులు ఆరోపించారు.ఈ చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనల్లో మహిళా పోలీసులు డ్యూటీలో ఉంచకపోవడంపై తీవ్రంగా విమర్శించారు. నిరసనకారుల అరెస్ట్ సమయంలో తమను పోలీసులు లైంగింకగా వేధించారని ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

తనపై అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఆ ప్రాంతంలో మహిళా పోలీసు సిబ్బంది లేకపోవడంపై ఏసీపీ వివేక్ భగత్‌ను ప్రశ్నించగా, తనపై దాడి చేసి వెనక్కి నెట్టేశారని ఆమె పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదని ఆరోపించారు.

ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టులు స్వేచ్ఛగా, భయంలేకుండా తమ విధులు నిర్వహించే వాతావరణం కల్పించాలని ఢిల్లీ పోలీసులను కోరింది. మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఢిల్లీ పోలీసుల తీరును తప్పుబట్టారు.

మహిళా జర్నలిస్టుల ఫిర్యాదుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఫిర్యాదులపై నిష్పక్ష పాతంగా దర్యాప్తు జరిపేందుకు  కేసులను క్రైం బ్రాంచికి అప్పగించినట్లు తెలిపారు.  

సీఈసీ  జ్ణానేష్ రాజీనామా, ఎన్నికల సంఘం లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా  జంతర్ మంతర్ నిరసన అక్టోబర్ 2నుంచి భారీ ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.  నిరసనల క్రమంలో జంతర్ మంతర్ తోపాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు.ఈ క్రమంలో తమకు ఎదురైన అనుభవాలపై ముగ్గురు జర్నలిస్టులు న్యూఢిల్లీ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై క్రైమ్ బ్రాంచ్ విచారణ చేపట్టి, బాధిత జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయనుంది.

©️ VIL Media Pvt Ltd.