Reading Time: 2 minutes
Bhogi Movie: ఇక కోత నాది లెక్క మీది.. అద్దిరిపోయిన ‘భోగి’ టీజర్.. శర్వానంద్‌ను ఇలా ఎప్పుడు చూసి ఉండరు

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ సినిమా టీజర్ విడుదలైంది. టీజర్‌లోని విజువల్స్ నెక్ట్స్ లెవల్‌లో ఉన్నాయి. 1960ల నాటి తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శర్వానంద్ ‘గంగ’ అనే ఊరమాస్ అండ్ రగ్డ్ లుక్‌లో ఇంటెన్స్ రోల్‌లో కనిపిస్తున్నారు. ఆయన చెప్పిన తెలంగాణ స్లాంగ్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్ర టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ భోగి సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అంశాలతో వస్తున్న ఈ చిత్రంపై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది.

1960ల నాటి ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నేపథ్యంలో ‘భోగి’ సినిమా స్టోరీ సాగనున్నట్లు టీజర్ ను బట్టి తెలుస్తోంది. చెడు, అహింస, బానిసత్వంపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ డిఫరెంట్ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘బొగ్గుల గుట్ట’ అనే ఊరిలో గ్రామస్థులు దొరల పాలనలో ఉంటారు. వారి కింద బానిసలుగా దొరికిన పని చేస్తూ బతుకుతుంటారు. మరి అలాంటి సామాన్యుల నుంచి దొరలను ఎదిరించే ఓ వ్యక్తి పుట్టుకొస్తాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడి తమ హక్కులను ఎలా సాధించుకున్నాడు? అనేదే స్టోరీ అని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్..

శర్వానంద్ భోగి సినిమా టీజర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.