చాలా మంది వచ్చిన జీతాన్ని ఇంటి అవసరాల కోసమని.. ఈఎమ్ఐ అని ఇలా రెండ్రోజులకే ముగించేస్తారు.. కానీ సెడన్‌గా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే.. డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా కష్టపడకూడదంటే.. మీ నెలవారీ సంపాదనలో కచ్చితంగా కొంత మొత్తాన్ని మీరు తప్పనిసరిగా ఆదా చేయాలని చాణిక్యుడు చెబుతున్నారు. అవును ఒకేసారి ఎక్కువ డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరం లేదు.. మీ సాలరీలోని కొంత భాగాన్ని మీరు సేవ్ చేసినా.. ఆ డబ్బే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుటుంది. ఏదైనా ఆర్థిక సంక్షోభం వంటి పిరస్థితులు వచ్చిన మీకు అనారోగ్యం వచ్చినా ఈ సేవింగ్స్ మీకు ఎంతగాలో ఉపయోగపడుతా. కాబట్టి ఖర్చు చేసే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
మన సంపదలో కొంత మేర నిస్సహాయులకు దానం చేయడం వల్ల మన ఐశ్వర్యం పెరుగుతుందంటే మీరు నమ్ముతారా? నమ్మాలి ఆచార్య చాణిక్య ప్రకారం.. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించకపోతే.. నిల్వ ఉన్న నీరు కలుషితమైనట్టేనని చాణిక్యుడు చెబుతున్నారు. ఇలా దాచే సంపద కాలక్రమేణా దాని విలువను కోల్పోతుందని తెలిపారు.కాబట్టి మీ అవసరానికి మించిన దనం ఉంటే.. అందులో కొంత భాగాన్ని నిస్సహాయులకు, అవసరార్థులకు దానం చేయాలని చెబుతున్నారు. అంటే పెద్ద మొత్తంలో కాదు.. మీకు తోచినంత.. ఇది సమాజంపై సానుకూల ప్రభావం చూపడంతో పూటు, మీకు మానసిక సంతృప్తిని ఇస్తుందని తెలిపారు.
ఈ రోజుల్లు త్వరగా డబ్బు సంపాధించాలని చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈజీ మనీకోసం అవాటు పడి.. తప్పుడు మార్గాల్లో డబ్బును సంపాధిస్తున్నారు. కానీ ఇలా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదని ఆచార్య చాణిక్య చెబుతున్నారు. పక్కవారిని మోసం చేసి లేదా అవినీతి ద్వారా సంపాదించిన సంపద ఎప్పటికీ శాశ్వతం కాదని.. అలాంటి డబ్బు తొలుత ఆనందాన్ని ఇచ్చినా, రాబోయే రోజుల్లో కష్టాలు తెచ్చిపెట్టవచ్చని చెబుతున్నారు.కాబట్టి కష్టమైనా సరే.. మంచి మార్గంలోనే సంపాదించడం నేర్చుకోండి.
మీరు మొదట్లో తక్కువ సంపాధించినా సరే.. దాన్ని కష్టపడి నిజాయితీగా సంపాదిస్తే అది మీకు నిజమైన మనఃశాంతిని ఇస్తుంది. అలా కాకుండా అడ్డదారుల్లో సంపాధించి సర్వస్వం కోల్పోయిన ఎంతో మంది వ్యక్తులను మనం రోజూ సమాజంలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీర్ఘకాలంలో స్థిరంగా ఉండాలంటే ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే డబ్బు సంపాదించడం అలవాటు చేసుకోండి.
తక్కువ డబ్బులు సంపాదిస్తే ఎప్పటికీ దనవంతులం కాలేమని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు సమస్య వారి సపాదనలో కాదు.. వారు చేసే ఖర్చులో ఉందని చాలా మందికి తెలియదు. అవును చాలా మంది అవనసర ఖర్చులు పెడుతూ.. తమ డబ్బును వృథా ఖర్చు చేస్తుంటారు. ఈ చిన్న అలవాటు మార్చుకుంటే.. వారి ఆర్థిక పరిస్థితి క్రమంగా బెటర్ అవుతుందని చాణక్యుడి చెబుతున్నారు. కాబట్టి పైన పేర్కొన్న ఈ అవాట్లను మీరు అలవర్చుకుంటే.. ఉన్న డబ్బుతోనే మీరు సంతోషంగా ఉండడంతో పాటు ఆర్థికంగా కూడా ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి.




