Reading Time: 2 minutes
Vivo S60t Price Specs Features

వీవో సంస్థ తన ఎస్-సిరీస్‌లో భాగంగా ‘వీవో S60t’ (Vivo S60t) స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. స్లిమ్ డిజైన్‌తో పాటు అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. ఈ ఫోన్ 12GB+256GB వేరియంట్ ధర సుమారు రూ. 52,000 (3,599 యువాన్లు) ఉండగా, 12GB+512GB వేరియంట్ ధర సుమారు రూ. 58,000 (3,999 యువాన్లు)గా ఉంది. స్టార్రీ సీ, ఎర్లీ సమ్మర్ గ్రీన్, మిడ్‌సమ్మర్ నైట్ అనే ఆకర్షణీయమైన కలర్స్‌లో ఇది లభిస్తుంది. ఇతర దేశాల్లో దీని విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ స్మార్ట్‌‌ఫోన్‌లో అద్భుతమైన డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, HDR సపోర్ట్, 2750×1260 పిక్సల్స్ రిజల్యూషన్‌‌ కలిగిన 6.59-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉంది. గేమింగ్ సమయంలో ఇది 300Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 12GB ఫిజికల్ రామ్‌తో పాటు 24GB వరకు వర్చువల్ మెమరీ ఫ్యూజన్ సపోర్ట్ ఉంది. అలాగే 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.

కెమెరా విభాగంలో వీవో S60t అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో OIS సపోర్ట్ కలిగిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 100x డిజిటల్ జూమ్, OIS సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. అలాగే ముందువైపు ఆటోఫోకస్ కలిగిన 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో అత్యంత శక్తివంతమైన 7200mAh భారీ బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు రివర్స్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

భద్రత కోసం అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 17 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 7 (OriginOS 7) పై ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే స్టీరియో స్పీకర్లు, NFC, బ్లూటూత్ 5.4, వై-ఫై 6 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ మన్నిక కోసం IP68, IP69 రేటింగ్‌లతో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ రక్షణ కల్పించబడింది. బరువు సుమారు 207 గ్రాములు ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం ఫీచర్లతో టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.