కన్నడ చిత్రసీమలో తనదైన నటనతో అలరిస్తున్న వర్సటైల్ యాక్టర్ విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’ ప్రస్తుతం ఓటీటీ వేదికపై రచ్చ చేస్తోంది. థియేటర్లలో గ్రాండ్ సక్సెస్ సాధించిన ఈ చిత్రం డిజిటల్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణతో ట్రెండింగ్‌లో నిలిచింది.
గతంలో విజయ్ రాఘవేంద్ర నటించి మెప్పించిన ‘సీతారామ్ బినోయ్: కేస్ నెం. 18’ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కింది. సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ‘ఇన్స్పెక్టర్ సీతారామ్’ పాత్రలో విజయ్ రాఘవేంద్ర తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేశారు. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం వీక్షకులకు అందుబాటులోకి రావడం విశేషం.
ఆనేగడ్డ అనే ప్రాంతంలో జరిగే వరుస ఘోర హత్యల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. బాధితులపై విచిత్రమైన సంకేతాలు వదిలివెళ్లే ఒక సైకోపాథిక్ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఇన్స్పెక్టర్ సీతారామ్ రారంగంలోకి దిగుతాడు. ఈ క్రైమ్ కేస్ ఇన్వెస్టిగేషన్తో పాటు చాలా ఏళ్లుగా దూరమైన తన అక్కతో మళ్లీ కలవాలనే కథానాయకుడి వ్యక్తిగత సంఘర్షణ, ఎమోషనల్ ట్రాక్ ప్రేక్షకులను కథలోకి మరింతగా లీనం చేస్తాయి.
దర్శకుడు దేవీప్రసాద్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రీన్‌ప్లేను అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. ఫ్లయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రానికి నవనీత్ శ్యామ్ అందించిన గూస్బంప్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, హేమంత్ ఆచార్య ఫొటోగ్రఫీ సస్పెన్స్ మూడ్‌ను పర్ఫెక్ట్గా బిల్డ్ చేశాయి. గోపాలకృష్ణ దేశ్‌పాండే, ఉషా భండారి కీలక పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు.
ట్విస్టులు, ఉత్కంఠరేపే సస్పెన్స్ సన్నివేశాలతో సాగే సాలిడ్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్స్ నిష్టపడే క్రైమ్ జానర్ ప్రేమికులకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్’ ఒక పర్ఫెక్ట్ ఓటీటీ వాచ్. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై 25 కోట్ల స్ట్రీమింగ్ నిమిషాలను దాటడం అంత సులభం కాదు. అలాగే, భారతదేశంలో వరుసగా 15 వారాల పాటు టాప్ 10 జాబితాలో నిలవడం కూడా అసాధారణమేమీ కాదు. ఈ ఘనత భారతీయ సినిమా స్థాయిలో కన్నడ సినిమా నాణ్యతకు నిదర్శనం. ఇది కన్నడ చిత్ర పరిశ్రమకు గర్వకారణం.




