
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మళ్లీ ఒంటరి అయ్యారు. టెస్లా సీఈఓ, స్పెస్ ఎక్స్ అధినేత అయిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఆయన సహచరురాలు శివోన్ గిల్లిస్‌తో కూడా బంధం తెగిపోవడం చర్చనీయాంశమైంది.
ఎలాన్ మస్క్ కంపెనీ అయిన ‘న్యూరాలింక్’లో ఉన్నతాధికారిగా ఉన్న శివోన్ గిల్లిస్ కెనడాలో పుట్టిన భారతీయ సంతతి మహిళ. శివోన్ గిల్లిస్ ఎలోన్ మస్క్‌తో తన బంధం ముగిసినట్లు స్వయంగా సోషల్ మీడియా (X)లో ప్రకటించారు. ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం ఒక వారంలోనే మా బంధం ముగిసిపోవడం బాధాకరమని పేర్కొన్న ఆమె, ఎలోన్ మస్క్‌తో మంచి స్నేహితులుగా కొనసాగుతూ మా పిల్లల బాధ్యతలను కలిసి చూసుకుంటామని తెలిపారు. ఒక బంధం ముగిసిపోవడం చాలా కష్టమని, కానీ కొన్నిసార్లు జీవితం అలానే ఉంటుందని శివోన్ గిల్లిస్ తన పోస్ట్‌లో రాశారు.
ఎలాన్ మస్క్ భాగస్వాములు, పిల్లలు
ఎలాన్ మస్క్ ఇప్పటివరకు పలువురు మహిళలతో ప్రేమ, వివాహ బంధాల్లో ఉన్నారు. ఆయన భాగస్వాముల వివరాలు చూస్తే :
జస్టిన్ విల్సన్: కెనడియన్ రచయిత్రి అయిన జస్టిన్ విల్సన్ ను ఎలోన్ మస్క్ మొదట వివాహం చేసుకున్నారు. వీరికి ఆరుగురు పిల్లలు ఉన్నారు.
టలుల్లా రైలీ: బ్రిటిష్ నటి అయిన టలుల్లా రైలీని ఎలోన్ మస్క్ పెళ్లి చేసుకొని, ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. మళ్లీ వీరిద్దరూ రెండోసారి పెళ్లి చేసుకొని, మళ్లీ విడాకులు తీసుకున్నారు.
అంబర్ హెర్డ్: హాలీవుడ్ నటి అంబర్ హెర్డ్‌తో కూడా ఎలోన్ మస్క్ కొంతకాలం డేటింగ్ చేశారు. వీరిద్దరి బంధం పలుమార్లు కలుస్తూ, విడిపోతూ సాగింది.
గ్రిమ్స్: కెనడియన్ సింగర్ అయిన గ్రిమ్స్‌తోనూ ఆయన బంధం అస్థిరంగా సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
శివోన్ గిల్లిస్: న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్‌తో ఎలోన్ మస్క్‌కు నలుగురు పిల్లలు (2021లో కవలలు స్ట్రైడర్, అజూర్; 2024లో కూతురు ఆర్కాడియా; 2025లో కుమారుడు సెల్డన్ లైకర్గస్) ఉన్నారు. ఇప్పుడు ఈ బంధం కూడా ముగిసింది. స్ట్రైడర్ పేరులోని ‘శేఖర్’ అనే పదాన్ని నోబెల్ బహుమతి గ్రహీత అయిన భారతీయ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు మీద పెట్టారని ఎలాన్ మస్క్ చెప్పారు. శివోన్ గిల్లిస్ ఎలాన్ మస్క్ వ్యక్తిగత జీవితంలో భాగం కావడమే కాకుండా, టెక్ ప్రపంచంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తి. ఎలాన్ మస్క్ కంపెనీ అయిన న్యూరాలింక్‌లో చేరడానికి ముందు, ఆమె OpenAIలో కూడా పనిచేశారు.
►ALSO READ | పండగకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా ? ఫ్యామిలీకి బెస్ట్ ఛాయిస్.. తక్కువ ధరకే స్మార్ట్ ఫీచర్లు!
యాష్లే సెయింట్ క్లెయిర్: రచయిత్రి, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన యాష్లే సెయింట్ క్లెయిర్ 2025లో తన కుమారుడు రోములస్‌కు ఎలోన్ మస్క్ తండ్రి అని బహిరంగంగా ప్రకటించారు.
మొత్తం పిల్లలు ఎంత మంది అంటే
ఈ బంధాల ద్వారా ఎలాన్ మస్క్‌కు మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు. ప్రపంచంలో జనాభా తగ్గుదల మానవ నాగరికతకే ముప్పని ఎలోన్ మస్క్ తరచూ చెబుతుంటారు. కానీ, కేవలం పిల్లలను కనడం కంటే వ్యక్తిగత బంధాలను శాశ్వతంగా నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఆయన జీవితం నిరూపిస్తోంది.