
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ ‘స్పైడర్-మ్యాన్’ సిరీస్ సినిమాలంటే ఆ క్రేజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది. ఇండియాలోనూ స్పైడర్-మ్యాన్ సినిమాలకు రికార్డు కలెక్షన్లు వస్తుంటాయి. అలా ఈ సిరీస్ లోనే విడుదలైన లేటెస్ట్ విజువల్ వండర్ ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’. జులై 30న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఈ సినిమా అలరించింది. అందుకు తగ్గట్టుగానే ఈ స్పైడర్ మ్యాన్ మూవీకి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు వచ్చాయి. గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 2.49 బిలియన్ డాలర్లు (సుమారు రూ.20,000 కోట్లకు పైగా) గ్రాస్ వసూలు చేసిన ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డుల కెక్కింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మిస్ అయిన వారికి, మళ్లీ మళ్లీ చూడాలనుకునే ఫ్యాన్స్ కోసం డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
కాగా ఇప్పటికే ఇండియా బయట ఇతర దేశాల్లో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఓటీటీలో రిలీజైన సంగతి తెలిసిందే. ఇండియాలో మాత్రం అక్టోబర్ 6 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే మొదట కేవలం రెంటల్ బేసిస్ లేదా బై ఆప్షన్స్ విధానంలో మాత్రమే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. అంటే, సాధారణ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారైనా సరే, ఈ సినిమాను వీక్షించడానికి అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫ్రీగా అందుబాటులోకి రానుంది.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీకి డెస్టిన్ డేవిట్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. టామ్ హాలెండ్, జెండయా, శాడీ సింక్, మార్క్ రఫాలో, జాకబ్, జాన్ బెర్న్‌థాల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మార్వెల్ స్టూడియోస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ మూవీని నిర్మించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.