Reading Time: < 1 minute
Smit Machchhar Bjps Sudhanshu Trivedi Questions Congress Silence Over Pilots Courage

BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో ఈ ఘటన జరిగింది. చివరకు సౌదీ అరేబియాలో సురక్షితంగా విమానాన్ని ల్యాండ్ చేశారు.

ఇదిలా ఉంటే, ఈ ఘటన దేశంలో రాజకీయ వేడిని రగిల్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కాంగ్రెస్‌లపై బీజేపీ విరుచుకుపడుతోంది. స్మిత్‌ సాహసాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నా, కాంగ్రెస్ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నిస్తోంది. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఇదే విషయంపై కాంగ్రెస్‌ను విమర్శించారు.

గతంలో జాకీర్ నాయక్, అఫ్జల్ గురు, బుర్హాన్ వానీ, యాకూబ్ మెమన్ వంటి వ్యక్తుల అంశాలపై కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యలు చేశారని, బాట్లాహౌజ్ ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్ మాట్లాడిందని త్రివేది అన్నారు. కాంగ్రెస్ ‘‘ఓటు బ్యాంక్ రాజకీయాలు’’ చేస్తోందని ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ చేసిన నాయకత్వ మార్పులపై కూడా ఆయన విమర్శలు చేశారు. యూపీలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బ్రహ్మణ వ్యక్తిని, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ముస్లిం నేతలను నియమించడంపై త్రివేది ఈ విమర్శలు చేశారు. దీనికి ఉత్తర్ ప్రదేశ్ ప్రజలే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.