
ఫ్లైదుబాయ్ హీరో’ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కి అరుదైన గౌరవం దక్కింది. ఒడిశాలోని పూరీ సముద్ర తీరంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ సైకత శిల్పాన్ని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించారు. కెప్టెన్ స్మిత్ సమయస్ఫూర్తి, సాహసానికి నిదర్శనంగా అద్భుతమైన ఇసుకతో ఆయన శిల్పాన్ని తీర్చిదిద్దారు.
ఫ్లైదుబాయ్ ఘటనలో స్మిత్ మచ్చర్ ధైర్య సాహసాలను పొగడుతూ వివిధ దేశాల అధినేతలు ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుల ప్రశంసలతో సహా మచ్ఛర్‌కు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తడంతో ఆయనకు గుజరాత్‌తో ఉన్న సంబంధాన్ని వెలుగులోకి తెచ్చాయి.
మచ్చర్ సొంత రాష్ట్రంలో గుజరాత్ లో కూడా అభినందనలు వెల్లువెత్తాయి. గుజరాత్ ప్రభుత్వం విశిష్ట గుజరాత్ గరిమా అవార్డుతో గౌరవించింది. మచ్చర్ లాంటి ధైర్యాసాహసి గుజరాత్ కు , భారతదేశానికి గర్వకారణమని సీఎం భూపేంద్ర పటేల్ పటేల్ అన్నారు.
30 ఏళ్ల మచ్ఛర్, గుజరాత్ లోని సురేంద్రనగర్ జిల్లా వధ్వాన్‌కు చెందినవాడు. అతని అత్తమామలు అమ్రేలి జిల్లాలోని సావర్‌కుండ్లలో నివసిస్తున్నారు. అతని కుటుంబం ఇప్పుడు ముంబైలోని ఘట్‌కోపర్‌లో స్థిరపడింది.
ఫ్లైదుబాయ్ విమానంలో ప్రయాణికులను కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలకు సైకత శిల్పంతో గౌరవం ప్రతీకగా నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న స్మిత్ మచ్చర్ సాహసం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.