Reading Time: < 1 minute

ఇండియా కూటమిలోకి టీవీకే పార్టీ.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన

Caption of Image.

తమిళనాడులో నటుడు, సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలో చేరింది. తమిళనాడులోని ఇండియా కూటమిలో టీవీకే  చేరిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మణికం ఠాగూర్ అధికారికంగా ప్రకటించారు.  ఈ పరిణామాన్ని కూటమికి  చారిత్రాత్మక దినం గా అభివర్ణించారు. టీవీకే చేరిక రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమిని బలోపేతం చేస్తుందని అన్నారు.

టీవీకే నేతలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ..  ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేసేవరవకు ఇండియా బ్లాక్ పోరాటం చేస్తుందన్నారు. తమిళనాడు వ్యాప్తంగా జిల్లా స్థాయి ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. 

SIR ప్రక్రియలో జరిగిన అవకతవకలు, EVMల గురించిన ఆందోళనలు, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌పై చర్చించేందుకు ఇండియా బ్లాక్‌కు చెందిన అగ్ర ప్రతిపక్ష నేతలు సెప్టెంబర్ 30న కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో సమావేశమయ్యారు. అనంతరం ముంబై, ఢిల్లీలలో కూడా నిరసనలకు దారితీసింది. ముంబైలోని శివాజీ పార్కు వద్ద కాక్రోచ్ జనతా పార్టీ, ఇతర పౌర సమాజ సంస్థల కార్యకర్తలు నిరసన చేపట్టగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు ప్రతిపక్ష నాయకులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ప్రతిపక్ష కూటమి రాబోయే రోజుల్లో అక్టోబర్ 6న ఒక కార్యక్రమం, నవంబర్ 1న ఢిల్లీలో ఒక ర్యాలీతో సహా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందన్నారు మాణిక్యం ఠాకూర్.

©️ VIL Media Pvt Ltd.