Reading Time: 2 minutes

మహిళల్లో నెలకు ఒకసారి పీరియడ్స్ రావడం సహజం. అయితే పీరియడ్స్ సమయానికి రాకపోతే లేదా ఆలస్యమైతే చాలామంది వెంటనే గర్భం దాల్చారేమో అని అనుకుంటారు. కానీ ప్రతిసారీ ప్రెగ్నెన్సీ ఒక్కటే కారణం కాదు. PCOS, PCOD కాకుండా మన జీవనశైలిలోని కొన్ని మార్పులు కూడా ఈ సమస్యకు దారితీస్తాయి. పీరియడ్స్ లేట్ కావడానికి గల ఇతర ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకుందాం.

తీవ్రమైన మానసిక ఒత్తిడి: ఈ రోజుల్లో ప్రతి చిన్న దానికి ఒత్తిడికి గురవ్వడం సర్వసాధారణమైపోయింది. శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇక దీనివల్ల పీరియడ్స్ సమయానికి రాకుండా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎక్కువ నిరంతర ఒత్తిడి అనుభవించే మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించవచ్చు.

Why Are Your Periods Late? These Causes May Be Responsible
Why Are Your Periods Late? These Causes May Be Responsible

బరువులో మార్పులు – హార్మోన్లు: అకస్మాత్తుగా బరువు తగ్గినా లేదా వేగంగా బరువు పెరిగినా పీరియడ్స్ సైకిల్ మారిపోతుంది. ఇక ఆకస్మికంగా బరువు తగ్గినప్పుడు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. అలాగే బరువు పెరిగినప్పుడు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయి ప్రభావితమై క్రమరహిత పీరియడ్స్‌కు దారితీస్తుంది.

ప్రీమెనోపాజ్ లక్షణాలు: సాధారణంగా మెనోపాజ్ 50 ఏళ్లు దాటాక వస్తుంది. కానీ కొంతమంది మహిళల్లో మెనోపాజ్ రావడానికి 10 నుంచి 15 ఏళ్ల ముందే శరీరంలో హార్మోన్ల మార్పులు మొదలవుతాయి. ఇక దీనిని ‘ప్రీమెనోపాజ్’ అంటారు. ఇక ఈ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిల్లో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల పీరియడ్స్ ఆలస్యమవుతుంటాయి.

మాత్రలు – రక్తహీనత: చాలామంది గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. వీటి ప్రభావం వల్ల కూడా పీరియడ్స్ మిస్ అవ్వడం లేదా లేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే శరీరంలో ఐరన్ లోపం లేదా రక్తహీనత ఉన్నప్పుడు కూడా క్రమం తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

పీరియడ్స్ ఆలస్యం కావడానికి ప్రెగ్నెన్సీ మాత్రమే కాకుండా ఇలాంటి అనేక ఆరోగ్య, జీవనశైలి కారణాలు ఉంటాయి. పదే పదే పీరియడ్స్ లేట్ అవుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా కారణాన్ని తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గమనిక: ఇది కేవలం మీ అవగాహన కోసం అందించిన ఆరోగ్య సమాచారం మాత్రమే. పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తుంటే లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు అనిపిస్తే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సరైన సలహా పొందండి.

The post పీరియడ్స్ లేట్ అవుతున్నాయా..? ప్రెగ్నెన్సీ ఒక్కటే కారణం కాదు.. ఈ కారణాలు కూడా ఉన్నాయి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.