Reading Time: < 1 minute

లండన్ స్క్వాష్ క్లాసిక్ చాంపియన్షిప్‌‌లో రెండో రౌండ్లోకి అనహత్‌‌

Caption of Image.

లండన్‌‌: ఇండియా జూనియర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌ అనహత్‌‌ సింగ్‌‌.. లండన్‌‌ స్క్వాష్‌‌ క్లాసిక్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్ తొలి రౌండ్‌‌లో వరల్డ్‌‌ 20వ ర్యాంకర్‌‌ అనహత్‌‌ 11–3, 11–2తో మరియమ్‌‌ మెట్‌‌వల్లి (ఈజిప్ట్‌‌)పై వరుస గేమ్‌‌ల్లో ఏకపక్ష విజయం సాధించింది.

గత రెండు సీజన్ల నుంచి సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న ఇండియన్‌‌ ప్లేయర్‌‌ అదే జోరును ఈ టోర్నీలోనూ కొనసాగించింది. కనీసం ప్రత్యర్థికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. బలమైన షాట్లతో వరుసగా పాయింట్లు గెలిచింది.

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో వరల్డ్‌‌ 42వ ర్యాంకర్‌‌ రమిత్‌‌ టాండన్‌‌ 11–6, 11–7తో అబ్దుల్లా అల్‌‌ తమీమ్‌‌ (ఖతార్‌‌)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌‌లో వరల్డ్‌‌ 38వ ర్యాంకర్‌‌ వీర్‌‌ ఛోత్రానీ 9–11, 9–11తో యాన్నిక్‌‌ విల్‌‌హెల్మీ (స్విట్జర్లాండ్‌‌) చేతిలో పోరాడి ఓడాడు.

©️ VIL Media Pvt Ltd.