Reading Time: < 1 minute

ఏం గుండె రా నీది: పోలీస్ ఇంట్లోనే బండి ఎత్తుకెళ్లిన దొంగ

Caption of Image.

సాధారణంగా దొంగలకు పోలీసులు అంటే భయం ఉంటుంది.. పోలీసులు ఉన్న వైపు కనీసం కన్నెత్తి కూడా చూడరు.. కానీ మనం మాట్లాడుకునే ఈ దొంగ మాత్రం వేరే లెవల్. చిన్నాచితక వాళ్ల ఇంట్లో చోరీ చేస్తే ఏం కిక్ ఉంటుందనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. ఏకంగా పోలీస్ ఇంటినే టార్గెట్ చేశాడు.. పోలీస్ ఇంట్లో దూరి ఏంచక్కా స్కూటీ ఎత్తుకెళ్లాడు. సామాన్యులకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ ఇంట్లోనే చోరీ జరిగిందన్న వార్తతో స్థానికులు నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణoలో ఆదివారం (ఆగస్ట్ 31) అర్ధరాత్రి ఓ దొంగ హల్చల్ చేశాడు. పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి చొరబడి బయట దండెంపై ఆరబెట్టిన దుస్తులు, వంట సామాగ్రి చోరీ చేశాడు. అలాగే, ఒక పోలీస్ ఇంట్లో చొరబడి స్కూటీని సైతం ఎత్తుకెళ్లాడు. దొంగ ఓ ఇంట్లో బట్టలు చోరీ చేస్తుండగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 

చోరీ మొత్తం ఒక ఎత్తయితే.. పోలీస్ ఇంట్లో దొంగతనం చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగ చేసిన పనికి పట్టణవాసులు ఆశ్చర్య పోతున్నారు. పోలీసుల ఇంటికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.