Reading Time: < 1 minute

స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? మీకుందా ఈ ఫోబియా ? ఈ ఐదు లక్షణాల్లో ఏది ఉన్నా..

Caption of Image.

నిద్రలేవగానే ఫోన్​ చూడడం వ్యసనంగా మారిపోయింది. బ్రష్​ చేస్తున్నా, బాత్రూంకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, బైక్​ లేదా కార్​ నడుపుతున్నా మొబైల్​ ఫోన్ ​చూడడం అలవాటైంది. ఎంతలా అంటే.. ఒక్క క్షణం ఫోన్​ కనిపించలేదంటే ప్రాణం ఆగమాగమైపోయేంతలా తయారైంది. ఫోన్ ​కనిపించకపోవడమే కాదు.. బ్యాటరీ చార్జింగ్​అయిపోవచ్చినా, నెట్​ కాసేపు ఆగినా టెన్షన్​పుడుతున్నది.

దీన్నే నో మొబైల్​ ఫోబియా (నోమో ఫోబియా) అని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా దీని బారిన పడ్డారు. ఇది ముదిరిపోతే మానసిక, శారీరక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే మొబైల్ ఫోన్ను ఎంతలో ఉంచాలో అంతల్నే ఉంచాలని సూచిస్తున్నారు.

మీకుందా ఈ ఫోబియా ?

  • ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్: జేబులో ఫోన్ వైబ్రేట్ కాకపోయినా, మోగినట్లే అనిపించి మాటిమాటికీ జేబు తడుముకోవడం.
  • బ్యాటరీ ఫోబియా: బ్యాటరీ 20% కంటే తగ్గగానే ఏదో జరిగిపోతుందన్నట్లు గాబరా పడటం, వెంటనే పవర్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్ లేదా చార్జర్ కోసం వెతుక్కోవడం.
  • బెడ్డు మీదా ఫోనే: నిద్రపోయే ముందు, నిద్ర లేవగానే మొబైల్ చేతిలో ఉండాల్సిందే. అర్ధరాత్రి మెలకువ వచ్చినా నోటిఫికేషన్లు చెక్ చేయడం.
  • ఫ్యామిలీ కన్నా ఫోనే ముఖ్యం: ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తున్నా, బయటకు వెళ్లి సరదాగా గడిపే టైంలోనూ చేతిలో ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉండటం.
  • సిగ్నల్ లేకపోతే చిరాకు: ఊళ్లకు వెళ్లినప్పుడో, లిఫ్ట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నప్పుడో ఫోన్​ సిగ్నల్ పోతుంటుంది. అలాంటి సమయంలో తీవ్రమైన అసహనం, కోపం రావడం.
©️ VIL Media Pvt Ltd.