Reading Time: < 1 minute
Karthi Spy Thriller Trailer Sardar 2 Trailer Release Today

Sardar 2: తమిళ స్టార్ హీరో కార్తీ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ‘సర్దార్ 2’. ఇందులో ఎస్‌.జె. సూర్య మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, తెలుగు నటి అషు రెడ్డి కీలక పాత్రలు పోషిస్తుండగా, సామ్ సి.ఎస్. దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. దసరా కానుకగా 2026 సెప్టెంబర్ 10న ఈ మూవీ  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ గురించి మేకర్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చేసింది.  ‘సర్దార్ 2’ ట్రైలర్ ను ఈరోజు రాత్రి 8:15 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ట్రైలర్‌లో కార్తి ఎలాంటి యాక్షన్‌తో కనిపించబోతున్నారనే ఆతృత అభిమానుల్లో మొదలైంది.

‘సర్దార్’  మొదటి భాగం దీపావళి కానుకగా 2022 అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలవ్వగా, దాదాపు ₹40 కోట్ల బడ్జెట్‌తో ₹100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఆంధ్రా, తెలంగాణల్లోనూ ₹15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెట్టింది. పి.ఎస్. మిథ్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో కార్తి మరోసారి స్పై ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ‘సర్దార్’ తొలి భాగం మంచి విజయం సాధించడంతో రెండో భాగంపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి.  ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీని పలు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. తొలి భాగం ఇచ్చిన సక్సెస్‌ను సీక్వెల్ ఎంతవరకు కొనసాగిస్తుందో, ఇప్పటికే సినిమాపై ఉన్న బజ్‌కు ట్రైలర్ మరింత ఊపు తీసుకొస్తుందా అనేది చూడాలి.