Reading Time: 2 minutes

దలాల్ స్ట్రీట్‌‌‌‌లో ఐపీఓల సందడి.. ఈ వారం 7 పబ్లిక్ ఇష్యూలు.. 15 కంపెనీల లిస్టింగ్

Caption of Image.

న్యూఢిల్లీ: ఐపీఓ మార్కెట్‌‌ ఫుల్‌‌‌‌ జోష్‌‌‌‌లో ఉంది. ఈ  వారంలో మొత్తం రూ.1,415 కోట్ల విలువైన 7 పబ్లిక్ ఇష్యూలు సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం రానుండగా, ఏకంగా 15 కొత్త కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి.

మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓలు

పర్పుల్‌‌ స్టైల్‌‌ ల్యాబ్స్‌‌:  పెర్నియాస్ పాప్-అప్ షాప్  బ్రాండ్ పేరెంట్ కంపెనీ  అయిన ఈ లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ రూ.680 కోట్ల ఫ్రెష్‌‌‌‌ షేర్ల ఇష్యూతో ఆగస్టు 31న  ఇన్వెస్టర్ల ముందుకొస్తోంది. ప్రైస్ బ్యాండ్‌‌‌‌ను  రూ.546-–575 గా నిర్ణయించారు.  సెప్టెంబర్ 2న ఐపీఓ ముగుస్తుంది.

రేస్ ఆఫ్ బిలీఫ్: మామ్స్‌‌‌‌ బిలీఫ్ పేరెంట్ కంపెనీ అయిన ఈ సంస్థ ఐపీఓ  సెప్టెంబర్ 1న ప్రారంభమవుతుంది. 3న ముగుస్తుంది. ఒక్కో షేరును  రూ.227–-239 రేంజ్‌‌‌‌లో అమ్మనున్నారు.   రూ.125 కోట్ల ఫ్రెష్‌‌‌‌ ఇష్యూ ఉంటుంది. 

దీపా జ్యువెలర్స్: తెలంగాణకు చెందిన బీ2బీ గోల్డ్ జ్యువెలరీ సంస్థ రూ.459.71 కోట్లు సమీకరించేందుకు ఐపీఓ ప్రారంభించనుంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.250 కోట్లు + ఆఫర్ ఫర్ సేల్ ద్వారా రూ.209.71 కోట్లు సేకరించనుంది.  ప్రైస్ బ్యాండ్‌‌‌‌ను  రూ.168-–177 గా నిర్ణయించారు. కంపెనీ ఐపీఓ  సెప్టెంబర్ 1న ఓపెనై,  3న  ముగుస్తుంది.

ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఈ నుంచి కొన్ని

అశుతోష్ ఫైబర్ (ప్రైస్ బ్యాండ్ రూ. 87–92), శాంతి ఇనార్గానిక్స్ (రూ.79–83), ఫైకెమ్ టెక్నాలజీస్ (రూ.51–54 ) ఐపీఓలు  ఆగస్టు 31న ప్రారంభమవుతాయి. కాంట్రాక్ట్ ఫార్మింగ్ సంస్థ ఫార్మ్ పీస్ (రూ.59) పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 1న ప్రారంభం కానుంది.

ఇప్పటికే ఓపెన్‌లో ఉన్నవి

లూమినో ఇండస్ట్రీస్ ( సైజ్ రూ.700 కోట్లు) ఐపీఓ ఆగస్టు 31న ముగియనుండగా.. ఇప్పటివరకు 4.87 రెట్లు సబ్‌‌‌‌స్క్రైబ్ అయింది. ఈఎస్‌‌‌‌డీఎస్ సాఫ్ట్‌‌‌‌వేర్ 2.1 రెట్లు), ప్రయారిటీ జ్యువెల్స్ 1.93 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయ్యాయి. ఇవి  సెప్టెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటాయి. ఎస్‌‌‌‌ఎమ్‌‌‌‌ఈలో క్విక్ ఫొరెన్సిక్ సొల్యూషన్స్ ఆగస్టు 31న, కంప్లీట్ స్పోర్ట్స్, పలుక్ టెక్నాలజీస్ సెప్టెంబర్ 1న ముగుస్తాయి.

15 కంపెనీల లిస్టింగ్

మెయిన్‌‌‌‌బోర్డ్ నుంచి ఆగ్‌‌‌‌మాంట్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ (ఆగస్టు 31),  హై-టెక్ ఇంజనీర్స్, స్కైవేస్ ఎయిర్, సింబయోటెక్ ఫార్మాలాబ్ (సెప్టెంబర్ 1),  అన్ను ప్రాజెక్ట్స్ (సెప్టెంబర్ 2),  లూమినో ఇండస్ట్రీస్ (సెప్టెంబర్ 3),  ఈఎస్‌‌‌‌డీఎస్ సాఫ్ట్‌‌‌‌వేర్, ప్రయారిటీ జ్యువెల్స్ (సెప్టెంబర్ 4) ఈ వారం లిస్టింగ్  కానున్నాయి.  ఎస్‌‌‌‌ఎంఈ సెగ్మెంట్ నుంచి  మధుర్ నిట్ క్రాఫ్ట్స్, ఏబీహెచ్ హెల్త్‌‌‌‌కేర్ (సెప్టెంబర్ 1),  సుమాక్స్ ఇంజనీరింగ్ (సెప్టెంబర్ 2),  క్విక్ ఫొరెన్సిక్ (సెప్టెంబర్ 3),  కంప్లీట్ స్పోర్ట్స్, పలుక్ టెక్నాలజీస్ (సెప్టెంబర్ 4) మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి.
 

©️ VIL Media Pvt Ltd.