
వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ : ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం అడ్డుకాదని నిరూపించింది ఆ జంట. నిజామాబాద్‌కు చెందిన తాటిపాముల సంజయ్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆ దేశానికి చెందిన సబ్రినా ఏమీస్వైన్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇరువురి కుంటుంబసభ్యులను ఒప్పించిన ఆ జంట అదివారం నిజామాబాద్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.