
భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలోని నారాయణపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులకు చెందిన రెండు భారీ డంప్ లను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల నుంచి ఇంటిలిజెన్స్ వర్గాలు సేకరించిన సమాచారం మేరకు బలగాలను అడవుల్లో తిరుగుతూ డంప్ లను వెలికితీస్తున్నాయి.
నారాయణ్పూర్ ఎస్పీ సందీప్కుమార్పటేల్ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా పోలీసులు, బీఎస్ఎఫ్జవాన్లు అదనార్అడవుల్లో తనిఖీలు చేపట్టాగా డంప్ బయటపడింది. 303 రైఫిల్, నాలుగు 315 రైఫిల్స్, ఐదు 12 బోర్తుపాకులు, రెండు బీజీఎల్ లాంఛర్లు, టెలీస్కోప్, 13 బీజీఎల్సెల్స్, పదహారు 12 బోర్తూటాలు, 2 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకొని నారాయణ్పూర్ఎస్పీ ఆఫీస్ కు తరలించారు.
అలాగే సుక్మా ఎస్పీ మయాంగ్గుర్జర్ నేతృత్వంలో డీఆర్జీ, జిల్లా పోలీసులు, బస్తర్ఫైటర్స్ కలిసి కుంట పోలీస్స్టేషన్ పరిధిలోని బెల్పొచ్చా -గొంపాడు గ్రామ అడవుల్లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ నాలుగు బండిళ్ల కొడెక్స్ వైర్, పది డిటోనేటర్లు, 17 జిలిటిన్ స్టిక్స్, ఫ్యూజ్ వైరు, మూడు బండిళ్ల కరెంటు తీగ, 3, 5 కిలోల బరువున్న టిఫిన్స్ బాక్సు బాంబులు, ప్లాస్టిక్డస్ట్ బిన్స్, స్టీల్ టిఫిన్బాక్సులు, బ్యాటరీ దొరకగా.. వాటిని సుక్మా ఎస్పీ ఆఫీసుకు తరలించారు.