
ప్రస్తుతం జనాలు చాలామంది పుడుతూనే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుతన్నారు. కొత్తరోగాలు.. మనుషులను పట్టి పీడిస్తున్నాయి. కొన్ని రోగాలైతే వైద్య నిపుణులకు అంతు చిక్కడం లేదుయకూడా. కాని పూర్వ కాలంలో జనాలు 80 .. 90 ఏళ్లు వచ్చినా..అలుపు సొలుపూ లేకుండా ఉత్సాహంగా ఉండేవారు. మీరు కూడా వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే వారానికి రెండు సార్లు జొన్న అన్నం తింటే సెంచరీ కొడతారు. దానిని ఎలా తయారు చేయాలి… ఏమేమి కావాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
జనాలకు ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో కొంత మంది బియ్యం అన్నాన్ని పూర్తిగా మానేసి.. మిల్లెట్స్ వంటకాలపై దృష్టి సారించారు. వాటిలో జొన్నలు ఎంతో శక్తిని ఇస్తాయి. అందుకే జొన్నల అన్నం తినేందుకు చాలామంది మొగ్గె చూపుతున్నారు. కాని దానిని ఎలా తయారు చేయాలో చాలామంది సతమతమవుతున్నారు.
జొన్నల అన్నం తయారీకి కావాల్సినవి
- పచ్చ జొన్నలు : ఒక కప్పు
- పెసరపప్పు : అర కప్పు
- పల్లీలు : అర కప్పు
- టమాటాలు : మూడు ( కూర ముక్కలు మాదిరిగా కట్ చేసుకోవాలి)
- పచ్చిమిరపకాయలు: నాలుగు ( చిన్న ముక్కలుగా కట్చేయాలి)
- ఉల్లిపాయలు : రెండు ( మీడియమ్ సైజ్) ( ఒక్కొ ఉల్లిపాయ ఆరు ముక్కలు)
- కరివేపాకు : రెండు రెబ్బలు
- కొత్తిమీర : రెండు రెబ్బలు
- పుదీనా : రెండు రెబ్బలు
- జీడిపప్పులు : 20
- ఉప్పు : తగినంత
- ఆవాలు : ఒక టీ స్పూన్
- మిరియాలు : ఒక టీ స్పూన్
- జీలకర్ర : ఒక టీ స్పూన్
- ఎండుమిరపకాయలు : రెండు
- వెల్లుల్లి రెబ్బలు : ఆరు
- పచ్చి కొబ్బరి : కొద్దిగా
- అల్లం : కొద్దిగా
- పసుపు : చిటికెడు
- ఇంగువ: చిటికెడు
జొన్నల అన్నం తయారీ విధానం :
పెపరపప్పును శుభ్రంగా కడిగి కొద్ది సేపు నీళ్లలో నానబెట్టాలి. ఇప్పుడు జొన్నలను మిక్సీలో కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు కుక్కర్ లో పల్లీలు.. బరకగా చేసిన జొన్నల మిశ్రమం… ఇంతకుముందు నానబెట్టిన పెసరపప్పు.. తీసుకోవాలి. అందులో అన్నం వండేలా నీళ్లు పోయాలి.
తరువాత జీలకర, ఉల్లిపాయల ముక్కలు ( ఒక ఉల్లిపాయను ఆరు మక్కలు), పచ్చి మిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా నూనె, ఉప్పు వేసి మూత పెట్టి ఉడకపెట్టాలి. కుక్కర్ నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. జొన్నలు ఆలస్యంగా ఉడుకుతాయి.
ఇప్పుడు మరో పొయ్యిపై తాలింపును రడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి మూడు చెంచాల నెయ్యి, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఆవాలు, ఎండి మిరప కాయలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు, కొత్తిమీర, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి మొత్తం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేగిన తాలింపుని ఉడికిన జొన్న అన్నంలో వేసి కలుపుకోవాలి. అంతే సూపర్ టేస్టీ జొన్నల అన్నం రెడీ. దీనిని వారానికి రెండు సార్లు తింటే ఎంతో బలంగా .. ఆరోగ్యంగా ఉంటారు.