
మేడ్చల్ జిల్లాలోని ప్రముఖ ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన కీసరగుట్టలో బాలీవుడ్ సందడి నెలకొంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ కుమార్తె నీసా దేవగణ్ కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రముఖ సెలబ్రిటీ కుటుంబానికి చెందిన నీసా దేవగణ్ కీసర ఆలయానికి రావడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఆమెను చూసేందుకు భక్తులు గుమిగూడారు.