
Suryakumar Yadav: వరల్డ్ కప్ 2026 విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జాతీయ జట్టులోకి పునరాగమనం (కంబ్యాక్) చేయడంపై ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య, ఇటీవల ఫామ్ లేమి, ఐపీఎల్ ప్రదర్శన కారణాలతో ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఎంపిక చేసిన ఇండియన్ టీమ్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. ముంబైలో జరిగిన ప్రో గోవిందా లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య తన రీ-ఎంట్రీపై మాట్లాడుతూ.. నేను చాలా శ్రమిస్తున్నాను.. నా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాను.. అంతా బాగుంటే, సరైన సమయంలో పరిస్థితులన్నీ అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో విఫలమైన భారత్:
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీ20 సారథ్య బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్, ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఘోరంగా తడబడ్డాడు. దీంతో సెలెక్టర్లు అతడ్ని జట్టు నుంచి తప్పించి, శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ, అయ్యర్ నాయకత్వంలో ఇండియన్ టీమ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్ పర్యటనలో 2–0తో వైట్‌వాష్‌కు గురికావడమే కాకుండా, ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4–0తో ఘోరంగా ఓడిపోయింది.
జయసూర్యతో స్కై సరదా ముచ్చట్లు:
ఇదిలా ఉండగా, కొలంబోలో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యతో భారత టీ20 విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ సరదాగా సంభాషించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. జయసూర్య ఫిట్‌నెస్‌ను చూసి మురిసిపోయిన సూర్య.. బాగా ఫిట్‌గా తయారవుతున్నారు.. ఏంటి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారా ఏంటి? చూస్తుంటే 100 శాతం రెడీగా ఉన్నట్లున్నారంటూ కామెంట్ చేశాడు. దానికి జయసూర్య చిరునవ్వు చిందించారు. మరోవైపు బీసీసీఐ వర్గాల ప్రకారం, సూర్యకుమార్ కోసం జాతీయ జట్టు తలుపులు పూర్తిగా మూసుకుపోలేదు.. డొమెస్టిక్ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తే, అతను మళ్లీ భారత జట్టులోకి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Suryakumar Yadav ka comeback statement — “mehnat kar raha hoon, sab kuch theek raha toh apne aap set ho jayega.” Pro Govinda League Season 4 ke final day pe pahunche. #SuryakumarYadav pic.twitter.com/hbVNdnzs18
— Mohit SY (Farmer’S SON) (@imohitray_) August 28, 2026
Brand Ambassador Suryakumar Yadav at the Pro Govinda League 2026 Final 🔥
– Bro was given the easiest dance steps… and still turned it into a full SKY special! 😅🔥 pic.twitter.com/EUUSHpCfmq
— Jara (@JARA_Memer) August 28, 2026