Reading Time: 2 minutes
Renault Kwid Facelift 2027 Launched 4 Airbags New Features And Updated Design

Renault Kwid Facelift 2027: రెనాల్ట్ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ Kwidకు కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ బ్రెజిల్ మార్కెట్లో 2027 Renault Kwid Faceliftను విడుదల చేసింది. ప్రస్తుత తరం క్విడ్‌కు ఇది రెండో ప్రధాన ఫేస్‌లిఫ్ట్‌గా నిలిచింది. బయట డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు, ముఖ్యంగా ఇంటీరియర్‌లో భారీగా అప్‌గ్రేడ్‌లు చేసింది. కొత్త క్విడ్‌లో 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వంటి భద్రత, సౌకర్య ఫీచర్లు ఉన్నాయి. అలాగే 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్, 7-అంగుళాల TFT డిజిటల్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.

ముందు భాగంలో కొత్త డిజైన్

2027 Renault Kwidలో ప్రధానంగా ముందు భాగంలో మార్పులు చేశారు. కొత్త బంపర్‌కు మరింత పదునైన డిజైన్ ఇచ్చారు. గ్రిల్‌కు గ్లాస్ బ్లాక్ ఫినిషింగ్ అందించి, రెనాల్ట్ తాజా డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా మార్చారు. అయితే కారు మొత్తం ఆకారం, కొలతల్లో పెద్దగా మార్పులు చేయలేదు. దీంతో Kwidకు ఉన్న కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ లుక్ కొనసాగుతుంది.

LED DRLs అన్ని వేరియంట్లలో

కొత్త మోడల్‌లో LED డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRLs), షార్క్-ఫిన్ యాంటెన్నా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. వెనుక భాగంలో కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ వచ్చింది. వీటికి పారదర్శక లెన్స్‌లు, బ్లాక్ ఇంటర్నల్స్ ఇచ్చారు. అలాగే రివర్సింగ్ కెమెరా పొజిషన్‌ను మార్చి, రెనాల్ట్ లోగోలోనే ఇంటిగ్రేట్ చేశారు.

Outsider వేరియంట్ మరింత స్పోర్టీగా

టాప్-ఎండ్ Outsider వేరియంట్‌కు ప్రత్యేకమైన డిజైన్ అందించారు. ఇందులో డ్యూయల్-టోన్ రూఫ్, కొత్త గ్రాఫిక్స్, బాడీ క్లాడింగ్, 14-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతో ఈ వేరియంట్ సాధారణ Kwid కంటే మరింత స్పోర్టీగా కనిపిస్తుంది.

పూర్తిగా కొత్త ఇంటీరియర్

2027 Kwidలో అతిపెద్ద మార్పులు ఇంటీరియర్‌లో కనిపిస్తాయి. రెనాల్ట్ డ్యాష్‌బోర్డ్‌ను పూర్తిగా రీడిజైన్ చేసింది. దీంతో పాత మోడల్‌తో పోలిస్తే క్యాబిన్ మరింత ఆధునికంగా కనిపిస్తుంది. ఎంపిక చేసిన వేరియంట్లలో కొత్త మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, రెండు USB Type-C పోర్టులు, రివర్సింగ్ కెమెరా, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేసుకునే ORVMలు ఉన్నాయి. టెక్నాలజీ పరంగా కూడా కొత్త Kwidలో కీలకమైన అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. ఇది Wireless Android Auto, Wireless Apple CarPlayకు సపోర్ట్ చేస్తుంది. అలాగే కొత్త 7-అంగుళాల TFT డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. దీంతో డ్రైవర్‌కు అవసరమైన సమాచారాన్ని డిజిటల్‌గా చూడవచ్చు.

1.0 లీటర్ ఇంజిన్.. 71 hp పవర్

మెకానికల్‌గా మాత్రం పెద్ద మార్పులు చేయలేదు. బ్రెజిల్-స్పెక్ 2027 Renault Kwidలో అదే 1.0-లీటర్, 3-సిలిండర్ SCe ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్ కొనసాగుతోంది. ఫ్లెక్స్-ఫ్యూయల్‌తో నడిచినప్పుడు పవర్: 71 hp, టార్క్ 98 Nm, పెట్రోల్‌పై.. పవర్: 68 hp, టార్క్: 92 Nm అందిస్తుంది. చిన్న కారు అయినప్పటికీ Kwidలో మంచి బూట్ స్పేస్ ఉంది. ఇందులో 290 లీటర్ల బూట్ కెపాసిటీ లభిస్తుంది. వెనుక సీట్లను మడిచినప్పుడు ఇది సుమారు 1,100 లీటర్లకు పెరుగుతుంది.

4 ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రత

భద్రత విషయంలో కూడా కొత్త Kwidలో పలు ఫీచర్లు ఉన్నాయి. బేస్ Evolution వేరియంట్‌లోనే 4 ఎయిర్‌బ్యాగ్‌లు లభించడం ప్రత్యేక ఆకర్షణ.

ఇతర భద్రతా ఫీచర్లు:

4 Airbags
Electronic Stability Control (ESC)
Traction Control
Hill-Start Assist
Rear Parking Sensors
Tyre Pressure Monitoring System (TPMS)
Electric Power Steering వంటి ఫీచర్లు ఉన్నాయి.

మూడు వేరియంట్లు.. ధరలు ఎంత?

Evolution BRL 71,090-సుమారు రూ.13.19 లక్షలు
Techno BRL 75,990-సుమారు రూ.14.10 లక్షలు
Outsider BRL 84,890-సుమారు రూ.15.75 లక్షలు

భారత్‌లో ఎప్పుడు?

ప్రస్తుతం ఈ 2027 Renault Kwid Facelift బ్రెజిల్ మార్కెట్ కోసం విడుదలైంది. భారత్‌లో ఇదే మోడల్ ఎప్పుడు విడుదల అవుతుంది, ఏ ఫీచర్లతో వస్తుంది, ధర ఎంత ఉంటుంది అనే విషయాలపై అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంటుంది. భారత్‌లో క్విడ్ ఇప్పటికే బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకవేళ కొత్త డిజైన్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, అదనపు భద్రతా పరికరాలతో ఫేస్‌లిఫ్ట్ భారత మార్కెట్లోకి వస్తే, చిన్న కార్లను కొనుగోలు చేసే వారికి ఇది ఆసక్తికరమైన ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.