
- పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ
వేములవాడ, వెలుగు: ‘రాతిరి రాతిరి’ లాటి ఫోక్సాంగ్స్తో ఫేమస్అయిన నటులు ఈశ్వర్సాయి, మాధురి రాథోడ్ ఏకంతంగా పట్టుబడడం సంచలనం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సమీపంలోని నందికమాన్వద్ద ఉన్న రెడ్డి సంఘం భవనంలోని ఓ గదిలో ఉండగా ఈశ్వర్సాయి భార్య శరణ్య వారిద్దరిని బుధవారం తెల్లవారుజామున రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకొని చితకబాదారు. కోట్లలో వ్యూస్ ఉన్న “రాతిరి రాతిరి”, “ప్రమీల ఓ ప్రమీల” వంటి ఫోక్ సాంగ్స్‌లో నటించిన ఈశ్వర సాయి, మాధురి రాథోడ్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించిన శరణ్య.. కొంతకాలంగా వారిపై నిఘా ఉంచారు.
పక్కా సమాచారంతో వేములవాడలోని ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఒకే గదిలో ఈశ్వర్, మాధురి రాథోడ్ కలిసి ఉన్న సమయంలో వారిని పట్టుకున్నారు. గదిలో వారిని నిలదీస్తున్న దృశ్యాలు, అక్కడ జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ విషయంపై సీఐ వీరాప్రసాద్ను వివరణ కోరగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. Eshwar Sai, Madhuri Rathod, Saranya, Vemulawada news, Rajanna Sircilla news,