Reading Time: < 1 minute

మేడారంలో ఘనంగా పొట్ట పండుగ

Caption of Image.

ములుగు జిల్లా మేడారంలో పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయంలో 2026 ఆగస్టు 19 రాత్రి అంతా జాగారాలు చేశారు పూజారులు. సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయంలో సాంప్రదాయ బద్ధంగా ప్రతిఏటా జరిగే పొట్ట పండుగను ఘనంగా జరుపుకున్నారు. 

 రాబోయే జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా ఈ విశిష్ట పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అర్ధరాత్రి వేళ ఆదివాసీ  సంస్కృతి సాంప్రదాయ పద్దతి లో దేవతలకు  ప్రత్యేక పూజలు . చేశారు పూజారులు. రాత్రంతా జాగారం చేసి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి, తమ మొక్కుబడులు చెల్లించారు. 

ALSO READ : హుజురాబాద్‌‌‌‌‌‌‌‌లో పట్టపగలే భారీ చోరీ…టాటా ఏస్ అద్దాలు పగులగొట్టి రూ.2 లక్షలతో పరార్

కొత్తగా పండించిన మొక్కజొన్న, వరి కంకులతో పాటు వివిధ రకాల విత్తనాలను సేకరిస్తారు. వాటిని డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు కలిసి సమ్మక్క గుడిలో పెట్టి పత్యేకంగా పూజిస్తారు. అనంతరం సమ్మక్క సారళమ్మ గద్దెల దగ్గరకు వెళ్లి పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు, పూజారి కుంబాలు గుడిలో మొక్కులు చెల్లించి రాత్రంతా జాగారం చేస్తారు. ఇంతటితో పండుగ ముగుస్తుంది. 
 

©️ VIL Media Pvt Ltd.