Reading Time: < 1 minute
ఐసీయూలో సీనియర్ నటి షావుకారు జానకి.. వెంటిలేటర్‌పై చికిత్స

సీనియర్ నటి షావుకారు జానకి ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. షావుకారు జానకి (95)కి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ సమస్యలతో వారం రోజుల క్రితం చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన జానకి. నిన్న రాత్రి ఆరోగ్యం క్షీణించటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. 1950లో రిలీజ్ అయిన షావుకారు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జానకి, దాదాపు 450 సినిమాల్లో నటించారు. తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకొని గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు హిందీలోనూ నటించారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులతో కలిసి నటించారు. భారతీయ సినిమాకు ఆమె అందించిన సేవలకు గాను 2022లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించారు జానకి. 1950లో వచ్చిన షావుకారు సినిమాతో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే తిరుగులేని నటిగా క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా పెట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వందలాది సినిమాలు చేశారు షావుకారు జానకి. తన అందం, అభినయంతో దాదాపు 5 దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. హీరోయిన్ గానే కాకుండా సహాయక నటిగానూ మెప్పించారీ సీనియర్ నటీమణి. త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.