Reading Time: < 1 minute

ఆందోళనకారులకు అండ: కాక్రోచ్ జనతా పార్టీ సరికొత్త వెబ్‌సైట్.. రూ. కోటి ఫండ్ ప్రకటించిన కపిల్ సిబల్

Caption of Image.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో ఆందోళనకారులకు అండగా నిలిచేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నిర్ణయం తీసుకుంది. నిరసనల్లో పాల్గొని తప్పుడు కేసులను ఎదుర్కొంటున్న వారికి న్యాయపరమైన సాయం అందించేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 

ప్రముఖ సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.ఈ ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఏ నిరసనకారుడు లేదా విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారనే వివరాలను ట్రాక్ చేస్తారు. అంతేకాకుండా, ఆందోళనకారులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చే న్యాయవాదులను ఈ వేదిక ద్వారా బాధితులతో అనుసంధానం చేస్తామని కపిల్ సిబల్ , సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. సహాయం చేయాలనుకునే లాయర్లు ఈ వెబ్‌సైట్‌లో తమ పేర్లు, ప్రాంతం వివరాలను రిజిస్టర్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు.

►ALSO READ | CJP నిరసనకారులపై.. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విమర్శలు

ఈ న్యాయ పోరాటం కోసం తాను వ్యక్తిగతంగా రూ.  కోటి రూపాయల నిధిని  విరాళంగా ప్రకటిస్తున్నట్లు కపిల్ సిబల్ వెల్లడించారు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ శాంతియుత ఆందోళనకారులపై బనాయించే తప్పుడు కేసులను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు, ప్రజలు ఎవరికి తోచిన విధంగా (కనీసం ఒక్క రూపాయి అయినా సరే) ఈ ఫండ్‌కు విరాళాలు అందించి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నిధుల నిర్వహణ బాధ్యత పూర్తియంగా సీజేపీ చూసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

©️ VIL Media Pvt Ltd.