Reading Time: < 1 minute
Former Bjp Mlas Daughter Alleges Molestation During Jantar Mantar Student Protest

CJP Protest: సీజేపీ ఆందోళనలకు సంబంధించిన కొత్త సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ జిల్లాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వీ రాజే సింగ్‌ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో లైంగిక వేధింపులకు గురైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా చెడు అనుభవాన్ని పంచుకున్నారు.

జూలై 24న యశస్వీ తన సోదరితో కలిసి జంతర్ మంతర్ వద్ద విద్యా్ర్థి నిరసనల్లో పాల్గొన్నారు. జనాల గుండా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక బారికేడ్ కింద పడిపోయిందని, ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని, తన వెనక నిలబడిన వ్యక్తి లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. తనను అసభ్యంగా తాకుతూ.. బలవంతంగా అతడి చేతిని తన కాళ్ల మధ్య పెట్టాడని ఆమె చెప్పింది. ఈ ఘటన జరిగిన తర్వాత అతడిని మూడుసార్లు చెంప దెబ్బ కొట్టినట్లు వెల్లడించారు.

అయితే, ఈ ఘటన జరిగిన తర్వాత అక్కడ తనకు మద్దతు వస్తుందని ఆశించానని, కానీ అక్కడ ఉన్నవారు తనపైనే కోపం వ్యక్తం చేసినట్లు ఆరోపించారు. ఒక వాలంటీర్ ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నిస్తూ తనపై అరవడం ప్రారంభించినట్లు రాసింది. మరో వాలంటీర్ ఇలాంటి పొరపాట్లు జరుగాయని, పట్టించుకోవదని చెప్పారని వెల్లడించారు. ఈ సంఘటన తనకు తెలియదని ఆమె తండ్రి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ అన్నారు. యశస్వి తల్లి ఆమెతోనే ఉన్నారని, ఈ ఘటన గురించి ఆమెకు తెలిసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని కూడా ఆయన తెలిపారు.