July 16, 2026

లాస్ మాల్వినాస్ బ్యానర్‌తో అర్జెంటీనా.. ఫాక్‌లాండ్స్‌పై పాత గొడవ రీ-స్టార్ట్!

లాస్ మాల్వినాస్ బ్యానర్‌తో అర్జెంటీనా.. ఫాక్‌లాండ్స్‌పై పాత గొడవ రీ-స్టార్ట్!
Reading Time: 2 minutes

లాస్ మాల్వినాస్ బ్యానర్‌తో అర్జెంటీనా.. ఫాక్‌లాండ్స్‌పై పాత గొడవ రీ-స్టార్ట్!

Caption of Image.

Falklands Controversy: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో అర్జెంటీనా జట్టు ఇంగ్లాండ్‌ను 2–1తో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ హై-వోల్టేజ్ (High-voltage) మ్యాచ్ ముగిసిన తర్వాత అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీతో పాటు అతని సహచర ప్లేయర్స్ చేసిన సంబరాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైల్డ్ ఫైర్ (Wildfire) అవుతున్నాయి. గెలుపు ఆనందంలో అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటినాస్ (Las Malvinas son Argentinas) అని రాసి ఉన్న ఒక పెద్ద బ్యానర్‌ ప్రదర్శించారు. 

అసలేమిటీ లాస్ మాల్వినాస్ వివాదం?: 
ప్రపంచ పటాన్ని నిశితంగా గమనిస్తే, దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో అర్జెంటీనా తీరానికి సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ద్వీపసమూహమే ఈ ఫాక్‌లాండ్ దీవులు (Falkland Islands). అర్జెంటీనా వాసులు వీటిని లాస్ మాల్వినాస్ (Las Malvinas) అని పిలుస్తారు. 1833 నుంచి బ్రిటన్ (UK) ఈ దీవులపై తన పరిపాలనను కొనసాగిస్తోంది. అయితే, గత రెండు శతాబ్దాలుగా ఈ భూభాగం తమదేనంటూ అర్జెంటీనా సార్వభౌమత్వాన్ని క్లెయిమ్ చేస్తోంది.

ఫాక్‌లాండ్స్ యుద్ధం: 
ఈ వివాదం కాస్తా 1982లో ఫాక్‌లాండ్స్ యుద్ధానికి దారితీసింది. 74 రోజుల పాటు జరిగిన ఈ భీకర పోరాటంలో 649 మంది అర్జెంటీనా సైనికులు, 255 మంది బ్రిటిష్ సైనికులు, ముగ్గురు స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి బ్రిటన్ తిరిగి నియంత్రణ సాధించినప్పటికీ, అర్జెంటీనా మాత్రం ఇప్పటికీ ఆ దీవులు తమవేనని గట్టిగా వాదిస్తోంది.

►ALSO READ | ఫ్లెమింగ్ ఎగ్జిట్.. సీఎస్కేకు కొత్త కోచ్ ఎవరు? తెరపైకి ధోనీ పేరును తీసుకొచ్చిన అశ్విన్!

నో పాలిటిక్స్ ఇన్ ఫుట్‌బాల్: 
ఆటల్లో ఎలాంటి రాజకీయ, సైద్ధాంతిక లేదా ప్రాంతీయ వివాదాల ప్రదర్శనను ఫిఫా (FIFA) కఠినంగా నిషేధిస్తుంది. ఫిఫా స్టేడియం కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇలాంటి వివాదాస్పద బ్యానర్లు ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం. 2014లో స్లోవేనియాతో జరిగిన ఒక మ్యాచ్‌లో ఇలాంటి బ్యానర్‌నే ప్రదర్శించినందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు ఫిఫా భారీ జరిమానా విధించింది. తాజా ఘటనపై ఫిఫా గనుక సీరియస్ అయి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే, జూలై 19న స్పెయిన్‌తో జరగబోయే మహా సంగ్రామానికి (ఫైనల్) ముందు అర్జెంటీనా జట్టుకు ఇది పెద్ద బ్యాక్ ఫైర్ (Backfire) అయ్యే ప్రమాదం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

©️ VIL Media Pvt Ltd.