Jabardasth Indraja: ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ జడ్జీగా ఇంద్రజ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఇంద్రజ. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. అయితే పెళ్లి, పిల్లల తర్వాత క్రమంగా సినిమాలకు విరామం ఇచ్చేసింది. ఇక చాలా మంది హీరోయిన్లలాగే ఇంద్రజ కూడా సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. సినిమాల్లో తల్లి, అత్త వంటి సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే బుల్లితెరపైనా మెరిసింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలకు ఇంద్రజ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ముఖ్యంగా జబర్దస్త్ షోకు జడ్జిగా ఈ సీనియర్ హీరోయిన్ బాగా సెట్టయిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి మొన్నటివరకు రోజా నే ఈ షోకు జడ్జ్ గా ఉన్నారు. అయితే రాజకీయాల్లో బిజీ కావడంతో ఆమె ఈ షో నుంచి వెళ్లిపోయారు. రోజా తర్వాత చాలా మంది ముద్దుగుమ్మలు ఈ షోకు జడ్జ్ లుగా వచ్చారు. ఖుష్బూ, సంఘవి.. ఇలా చాలా మంది వచ్చి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఇంద్రజ మాత్రం ఈ జబర్దస్త్ షోకు పర్మినెంట్ జడ్జీగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఈ షో కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇన్‌సైడ్ రిపోర్ట్స్ ప్రకారం జబర్దస్త్ కోసం ఇంద్రజ భారీ రెమ్యునరేషనే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎపిసోడ్ కు దాదాపు రూ.2.5 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన నెలకి నాలుగు లేదా ఐదు ఎపిసోడ్‌లకు గానూ ఒక రూ.10 లక్షల వరకు ఇంద్రజ తీసుకుంటన్నట్లు సమాచారం. అంటే కేవలం ఈ ఒక్క జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఆమెకు భారీ ఆదాయం సమకూరుతోంది. కాగా మిగతా జడ్జీలతో పోల్చుకుంటే ఇంద్రజపై పెద్దగా నెగెటివిటీ ఉండదు. అలాగే ఆమె క్లీన్ ఇమేజ్ కారణంగా ఫ్యామిలీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు ఉంది. అలాగే ఆమె కరిష్మా, టైమింగ్ కూడా జబర్దస్త్ షోకు బాగా హెల్ప్ అవుతున్నాయి. ఇది క్రమంగా జబర్దస్త్ టీఆర్పీ పెరగడంలోనూ సహాయ పడుతోంది. అందుకే జబర్దస్త్ కోసం ఇంద్రజకు భారీగానే రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచి ఈ షోకు జడ్జీగా వ్యవహరించి ఆపై మధ్యలో వెళ్లిపోయిన నాగబాబు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం జబర్దస్త్ ప్రొడ్యూసర్లు నాగబాబుకు ఒక్కో ఎపిసోడ్‌కు దాదాపు రూ.5 నుంచి రూ.6 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంద్రజ జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ సందడి చేస్తోంది. అలాగే సినిమాలు, వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.