July 15, 2026

EPFO: పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా..? ఉండదా..? ఆ లిమిట్ దాటితే కట్టాల్సిందేనా..? రూల్స్ ఇవే..

EPFO: పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా..? ఉండదా..? ఆ లిమిట్ దాటితే కట్టాల్సిందేనా..? రూల్స్ ఇవే..
Reading Time: 2 minutes
EPFO: పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ ఉంటుందా..? ఉండదా..? ఆ లిమిట్ దాటితే కట్టాల్సిందేనా..? రూల్స్ ఇవే..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నారు. వీరికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని అందరి అకౌంట్లో జమ చేసింది. జులై 15వ తేదీలోగా అందరి ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిన ఈపీఎఫ్ఓ.. ఈ మేరకు దాదాపు అర్హులైన వారందరికీ అందించింది. సుమారు 34 కోట్ల ఖాతాలకు మొత్తం రూ. 1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ అందించింది. గతంలో పీఎఫ్ వడ్డీని అక్టోబర్ లేదా నవంబర్‌లో జమ చేసేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియను చాలా వరకు సులభతరం చేశారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఉపయోగించి వేగవంతంగా ప్రాసెస్ చేశారు. 8.25 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం జమ చేశారు. తమ పీఎఫ్ బ్యాలెన్స్‌పై 8.25 శాతం వడ్డీని ఖాతాదారులు పొందారు.

పీఎఫ్ వడ్డీపై ట్యాక్స్ పడుతుందా..?

ఈపీఎఫ్ఓ వడ్డీపై ట్యాక్స్, టీడీఎస్ ఉంటుందా.. ఉండదా అనే డౌన్ చాలామందికి ఉంటుంది. అయితే నిబంధనల ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగి చెల్లించే పీఎఫ్ మొత్తం రూ. 2.5 లక్షలు దాటితే.. ఆ అదనపు మొత్తంపై వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. అలాగే ఆ మొత్తంపై టీడీఎస్ మినహాయింపు కూడా వర్తిస్తుంది. ఒకవేళ కాంట్రిబ్యూషన్ రూ. 2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే ఎలాంటి ట్యాక్స్ ఉండదు.

వడ్డీ ఎంత వస్తుంది..?

పీఎఫ్ వడ్డీని మీ పాస్ బుక్‌లోని నెలవారీ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ప్రతీ నెలలో ఎంప్లాయర్, ఎంప్లాయి కాంట్రిబ్యూషన్ జమ అవుతుంది. దీంతో నెలలవారీ బ్యాలెన్స్ ప్రకారం వడ్డీ లెక్కించి ఆర్ధిక సంవత్సరం చివరిలో జమ చేస్తారు. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా ఉంది. ఉదాహరణకు మీ పీఎఫ్ బ్యాలెన్స్ రూ.5 లక్షలు ఉంటే 8.25 శాతం వడ్డీ లెక్కిస్తే రూ.41,250 అందుతాయి. ఇక రూ.6 లక్షలు ఉంటే రూ.49,500, రూ.8 లక్షల బ్యాలెన్స్ ఉంటే రూ.66 వేలు, రూ.10 లక్షల పాస్ బుక్ బ్యాలెన్స్ ఉంటే రూ.82,500 వడ్డీ లభిస్తుంది.

పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..?

-https://passbook.epfindia.gov.in/MemberPassBook/login పోర్టల్‌ ఓపెన్ చేయండి

-యూఏఎన్ నెంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేయండి

-సైన్ ఇన్ బటన్‌పై క్లిక్ చేయండి

-మీ కంపెనీని ఎంచుకోండి

-పాస్ బుక్‌లో 2025 ఎంచుకోండి

-వివరాల్లో కింద వడ్డీ ఎంత పడిందనేది చెక్ చేసుకోవచ్చు

-ఎంప్లాయర్, ఎంప్లాయి షేర్‌పై మాత్రమే వడ్డీ లభిస్తుంది

-పెన్షన్ సొమ్ముపై వడ్డీ అనేది లభించదు