Dhoom 4: ‘ధూమ్ 4’ సినిమాపై కొనసాగుతున్న సస్పెన్స్

ధూమ్ 4 ఎందుకు లేట్ అవుతుంది..? బాలీవుడ్‌లో అంత క్రేజ్ ఉన్న ఫ్రాంచైజీ విషయంలో నిర్మాతలు ఎందుకు అంత సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు..? విలన్ దొరకడం లేదా..? లేదంటే వాళ్లు రాసుకున్న స్క్రిప్ట్ మళ్లీ మళ్ళీ మార్చేస్తున్నారా..? పుష్కర కాలంగా ఊరిస్తున్న ధూమ్ 4 వస్తుందా లేదా..? చాలా మంది హీరోలు మారినా.. ఆ సినిమా ఫ్యూచర్ ఎందుకు మారట్లేదు.. బాలీవుడ్‌లోనే కాదు మొత్తం ఇండియన్ సినిమా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధూమ్ 4’. ఈ ఫ్రాంచైజీలో వచ్చిన 3 భాగాలు హిట్ అవ్వడంతో కొత్త సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకపోవడానికి ముఖ్య కారణం సరైన కథ దొరకకపోవడమే. మరింత అద్భుతంగా, అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కించాలని నిర్మాత ఆదిత్య చోప్రా భావిస్తున్నారు. కథ విషయంలో కాంప్రమైజ్ అవ్వట్లేదు ఆదిత్య చోప్రా. గత 13 ఏళ్లలో సుమారు 9కి పైగా కథలను ఆయన విన్నప్పటికీ ఏదీ నచ్చలేదు.. అందుకే ధూమ్ 4 అంతకంతకూ ఆలస్యం అవుతుంది. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తారనే ప్రచారం జరిగింది.. కానీ వార్ 2 ఫ్లాప్ అవ్వడంతో అదక్కడే ఆగిపోయింది. పైగా కథ, స్క్రీన్ ప్లే విషయంలో తనకు పూర్తి స్వేచ్ఛ కావాలని అయాన్ పట్టుబట్టినట్లు వార్తలొచ్చాయి. ఆదిత్య చోప్రాతో అభిప్రాయ భేదాలు రావడంతో అయాన్ ముఖర్జీ రేసు నుంచి తప్పుకున్నారు. రణబీర్ కపూర్‌తో ధూమ్ 4 ప్లాన్ చేసినా.. ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’, ‘రామాయణం’తో బిజీగా ఉన్నారు. పైగా ధూమ్ 4ను యష్ రాజ్ ఫిల్మ్స్ సీక్వెల్‌లా కాకుండా.. కొత్త కథతో ప్లాన్ చేస్తున్నారు. జై, అలీ లాంటి పోలీస్ క్యారెక్టర్స్ కాకుండా కొత్త వాళ్లతో చేయాలని చూస్తున్నారు. మరి ఇది సాధ్యపడుతుందా లేదా..?
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!
రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్!
ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!
Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్ ఖాతాలోకి వచ్చింది!