బాక్సాఫీస్ వద్ద అఖిల్ ‘లెనిన్’ కలెక్షన్ల వర్షం.. 3 రోజుల్లోనే రూ. 61.1 కోట్లకుపై వసూళ్లు!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కికేని వారసుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’ ( Lenin ) బాక్సీఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి ఫుల్ జోష్ ను నింపింది.
జూలై 10, 2026 రిలీజైన చిత్రం .. ఈ మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో టిక్కెట్ల ధరలు పెంచకపోవడం, వీకెండ్ కావడం కూడా ఈ మూవీకి కలిసివచ్చింది. మూడవ రోజు వసూళ్లు .. మొదటి , రెండవ రోజుల వసూళ్లను కూడా అధిగమించింది. ఇదే జోరు కొనసాగితే .. రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ఫ్యాన్స్ , ట్రేడ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.
ఎంతో కాలంగా ఒక సాలిడ్ హీట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కష్టానికి ఫలితం దక్కింది. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి ఒక పక్కా రూరల్ రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. అఖిల్ నటనలో చూపించిన ఇంటెన్సిటీ, యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. అఖిల్ సరసన మెరిసిన గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌ను కట్టిపడేసింది. వీరికి తోడు సపోర్టింగ్ కాస్ట్‌లో ప్రమోద్ పంజు, శివాజీ, బ్రహ్మాజీ, సునీల్, ఈశ్వరీ రావు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఈ చిత్రాన్ని కింగ్ నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, ప్రముఖ నిర్మాత నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఆయన అందించిన సాంగ్స్, ముఖ్యంగా థియేటర్లు దద్దరిల్లేలా ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం అక్కినేని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది.
What a way to end the first weekend 🔥
The audience embraced it ❤️
The box office celebrated it 💥#LENIN Crossed 61.1 CR+ Worldwide Gross in just 3 Days ❤️🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1… pic.twitter.com/m1XnvP9Cki— Sithara Entertainments (@SitharaEnts) July 13, 2026