July 14, 2026

Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?

Lenin Success Meet : అఖిల్ ‘లెనిన్’ గ్రాండ్ సక్సెస్ మీట్ ఎప్పుడు ఎక్కడంటే?
Reading Time: < 1 minute
Lenin Success Meet On Wednesday July 15 In Guntur

అక్కినేని అఖిల్ కు లెనిన్ రూపంలో ఒక మంచి హిట్ వచ్చిందనే చెప్పాలి. వరుస ప్లాప్స్ తర్వాత అఖిల్ మాస్ మేకోవర్, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్, మరియు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు నరేషన్‌తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది లెనిన్. మొదటి వీకెండ్‌లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి సాలిడ్ హోల్డ్‌తో రన్ అవుతున్న ఈ సినిమా విజయానందాన్ని ప్రేక్షకులతో పంచుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. ఈ సినిమా సాధించిన భారీ విజయానికి కృతజ్ఞతగా ఒక గ్రాండ్ ‘సక్సెస్ మీట్’ నిర్వహించబోతున్నారు.

మొదటి రోజు 16.7 కోట్లు రాబట్టిన ఈ సినిమా రెండు రోజుల్లోనే 37.2 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడు రోజుల్లో మాస్ ర్యాంపేజ్ చూపించాడు అఖిల్. మొత్తంగా మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 61.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన కెరీర్లోనే హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల మేకర్స్ ఫుల్ కుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 15 అనగా బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో ‘లెనిన్’ సక్సెస్ మీట్‌ను భారీ స్థాయిలో నిర్వహించబోతుంది. అఖిల్ దాదాపు మూడేళ్ళ తర్వాత సినినా చేయడం దానికితోడు కెరీర బిగ్గెస్ట్ వసూళ్లు రాబడుతుండడంతో గుంటూరు హోరెత్తేలా సెలెబ్రేషన్స్ చేయాలని  అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో అఖిల్ అక్కినేనితో పాటు హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, నిర్మాతలు నాగవంశీ మరియు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.