ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్
ప్రస్తుతం స్టార్ హోదాలో ఉన్న తారలు చాలా కాలంగా ఒక్క సరైన అవకాశం కోసం ఎదురుచూసినవాళ్లే.. కొంతమంది స్టార్ డమ్ వచ్చిన తర్వాత కూడా సినిమాలకోసం ఎదురుచూస్తున్నారు. కొందరు వచ్చిన ప్రతి ఆఫర్ ఉపయోగించుకుని సహజ నటనతో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకున్నారు. వారిలో ఈ వయ్యారి భామ ఒకరు.
అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసింది. ప్రస్తుతం సినీరంగంలో స్టార్ దూసుకుపోతున్న ఈ అందాల భామ కూడా కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. తెలిపింది. అంతే కాదు తనను ఐరెన్ లెగ్ అనే ముద్ర వేశారని.. దీంతో రాత్రికి రాత్రే తనను తొమ్మిది సినిమాల నుంచి తీసేశారని తెలిపింది. కట్ చేస్తే ఆమె ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్..
ఆమె మరెవరో కాదు డర్టీ పిచ్చర్ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల గుండెల్లో గునపాలు దింపిన బాలీవుడ్ బ్యూటీ విద్య బాలన్. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యా బాలన్ మాట్లాడుతూ.. “కెరీర్ మొదట్లో హీరో మోహన్ లాల్ జోడిగా చక్రం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలిపింది..
అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆ సినిమా అనుకొనికరణల వల్ల ఆగిపోయింది. అందుకు నేను కారణం అంటూ ప్రచారం జరిగింది. దీంతో కొందరు నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసి నాపై విమర్శలు చేశారు. ఆ ఒక్క సినిమా ఆగిపోయిందని తెలిసి..ఐరెన్ లెగ్ అని ముద్ర వేయడంతో రాత్రికి రాత్రే నన్ను 9 ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు.
అయితే.. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆ సినిమా ఆగిపోవడానికి నేను కారణం కాదు. ఆ సినిమా డైరెక్టర్, మోహన్ లాల్ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశారు. కానీ ఆ సినిమా నా కెరీర్ పై ఎంతో ప్రభావం చూపించిందని చెప్పుకొచ్చింది విద్యా బాలన్.. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం విద్యా బాలన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది.




